జాతీయ వార్తలు

త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగర్తలా, మార్చి 4: త్రిపురలో పాతికేళ్ల సిపీఐ(ఎం) నాయకత్వంలోని లెఫ్ట్‌ఫ్రంట్ కంచుకోట బీటలువారింది. అప్రతిహతంగా సాగిన వామపక్ష పాలనకు పూర్తిగా తెరపడింది. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధానమైన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-ఐపీఎఫ్‌టి కూటమి అనితర విజయం సాధించటంతో లెఫ్ట్‌ఫ్రంట్ ప్రతిష్ట పూర్తిగా మసకబారింది. దీంతో, ఎన్నికల ఫలితాలు వెలువడి 24 గంటలు తిరగకముందే ముఖ్యమంత్రి మాణిక్ సర్కారు తన పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్ తతాగత రాయ్‌కి ఆదివారం సమర్పించారు. అయితే, కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించే వరకూ ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని మణిక్ సర్కార్‌కు గవర్నర్ రాయ్ సూచించారు. గవర్నర్‌కు రాజీనామా పత్రం సమర్పించిన అనంతరం రాజ్‌భవన్ ఎదుట తనను కలిసిన మీడియాతో మాట్లాడిన మాణిక్ సర్కారు, ఓటమిని నైతిక బాధ్యతగా స్వీకరించి రాజీనామా సమర్పించామన్నారు. ఇప్పటి వరకూ లెఫ్ట్‌ఫ్రంట్ పాలనకు పూర్తి సహకారం అందించిన ఉద్యోగులు, ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. లెఫ్ట్ ఫ్రంట్‌గా కంచుకోటగా మారిన త్రిపురలో బీజేపీ-ఐపీఎఫ్‌టి కూటమి మూడొంతుల మెజారిటీతో చారిత్రక విజయం సాధించటం తెలిసిందే. రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలకుగాను 59 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే, బీజేపీ, ఇండిజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ కూటమికి 43 స్థానాలు లభిస్తే, సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్‌కు కేవలం 16 స్థానాలే దక్కడం తెలిసిందే.

చిత్రం..రాజీనామా సమర్పించేందుకు గవర్నర్ తథాగత రాయ్‌ని కలిసిన
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్