జాతీయ వార్తలు

పిల్లల సంరక్షణ బాధ్యత అత్తగార్లదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జుంజును (రాజస్థాన్), మార్చి 8: పొత్తిళ్లలోని ఆడపిల్లలను అత్తగార్లే సంరక్షించి అమ్మతనం ప్రదర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అంతేకాదు, ఈ విషయంపై ప్రజల్లో మరింత చైతన్యం కలిగించేందుకు సామూహిక ఉద్యమాలపై రాష్ట్ర ప్రభుత్వాలూ ముందుకు కదలాలని మోదీ పిలుపునిచ్చారు. రాజస్తాన్‌లో గురువారం నేషనల్ న్యూట్రీషన్ మిషన్‌ను ప్రారంభిస్తూ ‘బేటీ బజావో బేటీ పడావో’ పథకాన్ని మరికొంతకాలం పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ‘ఆడపిల్లల విషయంలో గతతరాలు చేసిన పొరబాట్ల వల్ల స్ర్తి పురుష నిష్పత్తిలో విపరీతమైన వ్యత్యాసం చూస్తున్నాం. దీన్ని సరిచేయాల్సిన బాధ్యత కొత్తతరాలపై ఉంది’ అని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు. బాలికా సంరక్షణపై ప్రజలే స్వచ్ఛందంగా లక్ష్యాలు నిర్దేశించుకోవాలని, సమాజంలో మహిళలకు సమాన హోదా కల్పించాలని సూచించారు. ‘్భరత సమాజంలో కూతుళ్లు నిరాదరణ, నిర్లక్ష్యానికి గురవుతున్నారు. హత్యలకూ గురవుతున్నారు. ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతే సమాజం బ్యాలెన్స్ తప్పుతోంది. ఏ ఒక్క తరంతోనో ప్రగతి సాధ్యం కాదు. దానికి కొంత సమయం పడుతుంది. ఆ క్రమంలో మహిళలకూ సగభాగం కల్పించాలి’ అని మోదీ పిలుపునిచ్చారు. ఆడపిల్లలను రక్షించుకోవాలని విజ్ఞప్తులు చేయాల్సిన పరిస్థితి సమాజంలో ఉండటం బాధాకరమని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలను అత్తగార్లే సంరక్షించేలా రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను రూపొందించి చైతన్యపర్చాలని మోదీ సూచించారు. రెండేళ్ల క్రితం హర్యానాలో ఆడపిల్లల పరిస్థితి చూసి ‘బేటీ బజావో బేటీ పడావో’ ప్రారంభించామని, ఈ పథకంతో ఇప్పుడక్కడ అద్భుత ఫలితాలే కనిపిస్తున్నాయని మోదీ అన్నారు. బేటీ బచావో బేడీ పడావో అన్నది కేంద్రం నిర్వహిస్తున్న సామాజిక ప్రచారం మాత్రమేనని, బాలికలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల సామర్థ్యాన్ని పెంచడమే దీని లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కేంద్ర మహిళా సంక్షేమ శాఖా మంత్రి మేనకగాంధీ మాట్లాడుతూ కేంద్రం మహిళా సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు. ట్రాఫికింగ్ మీద పార్లమెంట్‌లో చారిత్రక బిల్లు ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. రాజస్థాన్ సీఎం వసుంధర రాజే మాట్లాడుతూ రాజశ్రీ యోజనలాంటి మహిళా సంక్షేమ పథకాలను రాష్ట్రం ఎన్నో అమలు చేస్తోందన్నారు. బేటీ బచావో బేటీ పడావో పథకంలో అత్యుత్తమ ఫలితాలు కనబర్చిన వివిధ జిల్లాల కలెక్టర్లకు ఈ సందర్భంగా ప్రధాని మోదీ అవార్డులు అందచేశారు. కార్యక్రమానికి హాజరైన మహిళలు, పిల్లలను స్వయంగా కలుసుకున్న మోదీ, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

చిత్రం..రాజస్థాన్‌లోని జుంజునులో గురువారం నేషనల్ న్యూట్రిషన్ మిషన్‌ను ప్రారంభిస్తూ
పిల్లలతో మమేకమైన ప్రధాని నరేంద్ర మోదీ