జాతీయ వార్తలు

పెరియార్ వివాదాన్ని పెద్దది చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 8: ద్రవిడ ఉద్యమ నేత ఇవి రామస్వామి పెరియార్‌పై బీజేపీ నేత హెచ్ రాజా చేసిన వ్యాఖ్యలు అనాగరికమేనని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. అయితే, తన వ్యాఖ్యలను తొలగించి పచ్చాత్తాపాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టడమే మంచిదని సూచించారు. ‘ఈ రోజు త్రిపురలో లెనిన్ విగ్రహానికి పట్టిన గతే రేపు తమిళనాడులో కమ్యూనిస్ట్ ఉద్యమ నేత పెరియార్ విగ్రహాలకూ పట్టొచ్చు’ అని బీజేపీ నేత రాజా వ్యాఖ్యానించటం అనాగరిక వైఖరిని ప్రతిబింబిస్తోంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని రజనీకాంత్ అన్నారు. అయితే, రాజా తన వ్యాఖ్యలను తొలగించి పచ్చాత్తాపం వ్యక్తం చేశారు కనుక, ఆ విషయాన్ని పెద్దది చేయడం ఎంతమాత్రం మంచిది కాదని నా అభిప్రాయం’ అని పేర్కొన్నారు. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ త్వరలో రాజకీయ పార్టీ పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న విషయం తెలిసిందే. దేశంలోని అనేక ప్రాంతాల్లో రాజకీయ నేతల విగ్రహాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో రజనీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత లెనిన్ విగ్రహం ధ్వంసం కావడం తెలిసిందే. అదే విషయాన్ని రాజా తన ఫేస్‌బుక్‌లో ప్రస్తావిస్తూ ‘తమిళనాడులో రేషనలిస్ట్ భావజాలాన్ని ప్రచారం చేసిన పెరియార్ విగ్రహాలూ ధ్వంసం కావొచ్చు’ అంటూ ఎఫ్‌బిలో పోస్ట్ చేశారు.
ట్విట్టర్‌లో రాజా వ్యాఖ్యలు పోస్టైన తరువాత వెల్లూరు జిల్లాలోని తిరుపత్తూర్‌లో పెరియార్ విగ్రహంపై దాడి జరగడం తెలిసిందే.