జాతీయ వార్తలు

నాగాలో కొలువుదీరిన రియో మంత్రివర్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహిమా, మార్చి 8: నాగాలాండ్ నూతన ముఖ్యమంత్రిగా ఎన్‌డీపీపీ నేత నీఫియు రియో గురువారం ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ పీబీ ఆచార్య రియోతో ప్రమాణ స్వీకారం చేయించారు. నాగాలాండ్ ముఖ్యంత్రి పదవి చేపట్టడం ఇది నాలుగోసారి. బీజేపీ భాగస్వామ్యంతో పీపుల్స్ డెమోక్రటిక్ అలయెన్స్ తరఫున రియో ప్రభుత్వం ఏర్పాటైంది. బీజేపీ నేత వై పట్టాన్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. పది మంది కొత్త మంత్రులతో రియో కేబినెట్ కొలువుతీరింది. బీజేపీ నుంచి ఐదుగురు, నేషనలిస్టు డెమోక్రటిక్ ప్రొగ్రెసీవ్ పార్టీ (ఎన్‌డీపీపీ) నుంచి ఇద్దరు, ఒక ఇండిపెండెంట్, జేడీయూ నుంచి ఒకరితో గవర్నర్ ఆచార్య ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. మాజీ సీఎం టీఆర్ జెలియాంగ్ కూడా హాజరయారు. అలాగే అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తరలివచ్చారు. నాగాలాండ్ అసెంబ్లీలో 60 మంది సభ్యులున్నారు. అందులో 32 మంది మద్దతు రియోకు ఉంది. ఎన్‌డీపీపీ 18, బీజేపీ 12, జేడీయూ ఒకరు, ఇండిపెండెంట్ ఒకరు రియోకు మద్దతు తెలిపారు.

చిత్రం..నాగాలాండ్ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన నీఫియు రియోతో అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ ముఖ్యమంత్రులు సర్బానంద్ సోనోవాల్, బైరెన్‌సింగ్, పేమాఖండూ, కార్నాడ్ సంగ్మా.