జాతీయ వార్తలు

నోటాకు ఓటెక్కువే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 10: భారత ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో విప్లవాత్మక మార్పు ఐదేళ్ల క్రితం చోటుచేసుకుంది. అదే 2013లో ప్రవేశపెట్టిన ‘వీళ్లెవరూ వద్దు’ ఆప్షన్. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రవేశపెట్టిన నన్ ఆఫ్ ది అబౌ (నోటా)కు ఓటు వేస్తున్న వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2013 సెప్టెంబర్ 27న సుప్రీం కోర్టు ‘బ్యాలెట్ పేపర్లు/ ఈవీఎం యంత్రాల్లో నోటాకు చోటు కల్పించాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. పోలింగ్ బూత్‌కు వచ్చిన ఓటర్లు ‘బరిలోవున్న అభ్యర్థులు ఎవరికీ ఓటు వేయదలచుకోలేదు’ అన్న విషయాన్ని ఓటు ద్వారా స్పష్టం చేసే అవకాశాన్ని నోటా కల్పిస్తోంది. ఈవీఎంలో నోటా బటన్ వినియోగించే అవకాశాన్ని 2013లో చత్తీస్‌గఢ్, మిజోరాం, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అందుబాటులోకి తెచ్చారు. 2013లో నోటా అవకాశాన్ని కల్పించిన తరువాత ఇప్పటి వరకూ ఎన్ని నోటా ఓట్లు పడ్డాయన్న విషయాన్ని ప్రజాస్వామ్య సంస్కరణల సమాఖ్య (ఎడీఆర్), జాతీయ ఎన్నికల వాచ్ (ఎన్‌ఇడబ్ల్యు) విశే్లషించాయి. గత ఐదేళ్లలో నోటాను ఆశ్రయించిన ఓటర్ల సంఖ్యను విశే్లషిస్తే, ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నికల్లో 1.33 కోట్ల నోటా ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సరాసరిన 2.70 లక్షల నోటా ఓట్లు పడ్డాయి. గోవా, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ ఉప ఎన్నికల్లోనూ నోటా ఓట్లు భారీగానే పోలయ్యాయంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. 2017 గోవా అంసెబ్లీ ఉప ఎన్నికల్లో పనాజీ, వాల్పోయ్ సెగ్మెంట్లలో నోటాను ఓటర్లు పెద్దఎత్తునే ఉపయోగించుకున్నారు. 2014లో తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో నోటాను ప్రవేశపెట్టారు. అప్పటి ఎన్నికల్లో 60,02,942 నోటా ఓట్లు పోలయ్యాయి. అప్పటి ఎన్నికల్లో తమిళనాడులోని నీలగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధికంగా 46,559 నోటా ఓట్లు పోలయ్యాయి. అలాగే లక్ష్యద్వీప్‌లో అత్యల్పంగా 123 నోటా ఓట్లు పోలయ్యాయి.