జాతీయ వార్తలు

ఏపీకి జోనూ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 12: ఏపీకి ప్రత్యేక హోదాయే కాదు, విశాఖకు రైల్వే జోనూ లేదంటూ కేంద్రం తేల్చేయబోతోంది. విశాఖ కేంద్రంగా ఏనాటికైనా రైల్వే జోను రాకపోతుందా? అంటూ వేయకళ్లతో ఎదురు చూస్తున్న ఏపీకి ఇది అశనిపాతంలాంటి వార్తే. కేంద్రం అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించకున్నా, కేంద్ర హోంశాఖ కార్యదర్శితో ఉభయ రాష్ట్రాల అధికారులు సోమవారం జరిపిన సమావేశంలో దాదాపు విషయన్ని తేల్చేశారని అంటున్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటువల్ల ఎలాంటి ప్రత్యేక లాభాలూ ఉండవని ఎక్స్‌పర్ట్స్ కమిటీ నివేదిక తేల్చేసిందని అంటున్నారు. ఆర్థికంగా రాష్ట్రం నిలదొక్కుకునే పరిస్థితే లేనప్పుడు ప్రత్యేక జోన్‌ను ఎలా ఏర్పాటు చేస్తామని హోంశాఖ కార్యదర్శి ప్రశ్నించారని అంటున్నారు. ఇదిలావుంటే, తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి బదులు ఇంజన్ల ఓవర్ హౌలింగ్ కర్మాగారాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నదని ఈ సమావేశంలో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయటం సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబే చెప్పినట్లు తెలిసింది. హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబే సోమవారం విభజన హామీల అమలుపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. రైల్వే జోన్ ఏర్పాటు గురించి ఆంధ్ర అధికారులు వాకబు చేసినప్పుడు ఈ అంశంపై సీనియర్ అధికారుల కమిటీ నివేదిక సమర్పించిందని, అధికారులు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుకు ప్రతికూల సిఫారసు చేశారని, అందుకే రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయటం సాధ్యంకాదని కేంద్ర హోం శాఖ కార్యదర్శి స్పష్టం చేసినట్లు తెలిసింది. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయటం ఆర్థికంగా ఎంతమాత్రం మంచిది కాదని నివేదిక సూచించిందని ఆయన చెప్పారని అంటున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకునే పరిస్థితి లేనప్పుడు ప్రత్యేక జోన్‌ను ఎలా ఏర్పాటు చేస్తామని హోంశాఖ కార్యదర్శి ప్రశ్నించారని అంటున్నారు. ఆంధ్ర, తెలంగాణలో ఏర్పాటు చేయవలసిన గిరిజన విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన బిల్లులు సిద్ధమయ్యాయనీ, కేంద్ర మంత్రివర్గం వీటికి ఆమోదముద్ర వేయగానే ప్రకటిస్తామని రాజీవ్ గౌబే చెప్పారని అంటున్నారు. తెలంగాణలో ఏర్పాటు చేయవలసిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి బదులు ఇంజన్ల ఓవర్ హౌలింగ్ కర్మాగారాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నదని హోంశాఖ కార్యదర్శి చెప్పారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు అంశం పరిశీలనలో ఉన్నదని, తుది నిర్ణయం తీసుకోగానే తెలియజేస్తామన్నారు. రాష్ట్ర విభజన చట్టం 13వ షెడ్యూలులోని అంశాలపై సోమవారంనాటి సమావేశాల్లో ప్రధానంగా చర్చించారు. 13వ షెడ్యూలులో విద్య, వౌలిక సదుపాయాల కల్పన అనే అంశాలున్నాయి. విద్యా అంశం పరిధిలో ఐదు అంశాలుంటే వౌలిక సదుపాయాల కింద పదకొండు అంశాలున్నాయి. సమావేశానికి ఏపీ నుండి చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్, ఆధిత్యనాథ్ దాస్, పలువురు ఇతర అధికారులు హాజరయ్యారు. తెలంగాణ నుండి ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అశోక్‌కుమార్, అదనపు రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి హాజరయ్యారు.