జాతీయ వార్తలు

గంగానదిలో విహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి, మార్చి 12: ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి వారణాసిలోని పవిత్ర గంగానదిలో పడవలో విహరించారు. ఆయన పడవలోకి వెళ్లేముందు, సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. షెహనాయ్ వాయిద్యం, మంత్రోచ్ఛాటనలతో పాటు మెక్రాన్‌పై పుష్పాలు చల్లుతూ పడవలోకి ఆహ్వానించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అస్సి, దశాశ్వమేథ్ ఘాట్‌ల మధ్య ఈ పడవ ప్రయాణం జరిగింది. ఈ రెండు ఘాట్ల మధ్య పెద్ద సంఖ్యలో ప్రజలు, భారత్-ఫ్రాన్స్ పతాకాలతో నేతలకు స్వాగతం పలికారు. అంతకుముందు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ట్రేడ్ ఫెసిలిటేషన్ సెంటర్ నుంచి, ఘాట్ల వరకు మెక్రాన్, మోదీ నడుచుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా కళాకారులు అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్నంగా మోదీ, వివిధ కళారూపాల గురించి మెక్రాన్‌కు వివరించారు. ప్రభుఘాట్ వద్ద కొందరు బౌద్ధ సన్యాసులు ప్రార్థనులు జరుపగా, ఛెట్‌సింగ్ ఘాట్ వద్ద కొందరు సాధువులు పవిత్ర మంత్రాలు ఉచ్ఛరించారు.

చిత్రం..వారణాసిలో పడవలోవిహరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్, యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్.