జాతీయ వార్తలు

సునంద పుష్కర్‌ది హత్యే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 12: కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ భార్య సునంద పుష్కర్ కేసు కొత్త మలుపుతిరిగింది. సునంద పుష్కర్‌ది హత్యేనంటూ ఓ రహస్య నివేదిక వెల్లడించింది. ఆమెను ఎవరు చంపిందీ విచారణలో తెలిసిందని, దర్యాప్తు అధికారుల వద్దా కచ్చితమైన సమాచారం ఉందంటూ ఓ వార్తా సంస్థ పేర్కొంది. సునంద పుష్కర కేసులో మొదటి నుంచీ మిస్టరీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వార్తా సంస్థ కథనం ప్రకారం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు బీఎస్ జైశ్వాల్ సునంద కేసులో తొలి నివేదిక ఇచ్చారు. ఆమె హత్యకు గురైన లీలా హోటల్‌ను సందర్శించి, దర్యాప్తు నిర్వహించారు. తరువాత సునంద పుష్కర్‌ది ఆత్మహత్య కాదంటూ సబ్‌డివిజన్ మెజిస్ట్రేట్ వసంత్ విహార్ అలోక్ శర్మకు డీసీపీ నివేదించారు. దీంతో సంతృప్తి చెందిన సబ్‌డివిజనల్ మెజిస్ట్రేట్ సమగ్ర విచారణ జరపాలని సరోజిని నగర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను ఆదేశించారు. సునంద పోస్టుమార్టం రిపోర్టులో ఆమెపై విష ప్రయోగం జరిగిందని తేల్చింది. ఆల్‌ప్రాజొలం ప్రయోగించినట్టు తెలిసింది. సునంద మృతదేహంపై ఇంజక్షన్ మార్క్‌లు కనిపించాయి. అలాగే పంటి గాట్లు కనిపించాయి. అక్కడ ఘర్షణ జరిగినట్టు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు గుర్తించారు. దీనికి తోడు తోపులాట లేదా నెట్టుకోవడం వల్ల అయిన గాయాల గుర్తులు గమనించారు. అలాగే పుష్కర్ ఆమె భర్త శశిథరూర్ మధ్య పెనుగులాట జరిగిందని వారి వ్యక్తిగత సహాయకుడు నరైన్‌సింగ్ తన వాంగ్మూలంలో వెల్లడించాడు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును దక్షిణ ఢిల్లీ రేంజ్ జాయింట్ పోలీసు కమిషనర్ వివేక్ గొగియా ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. కేసును మరింత లోతుగా విచారించిన వివేక్ శశిథరూర్ భార్య సునందది ముమ్మాటికీ హత్యేన్న నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు కేంద్ర హోమ్‌మంత్రిత్వశాఖకు ఆయన రహస్య నివేదిక ఇచ్చారని ఆ వార్త సంస్థ వెల్లడించింది.