జాతీయ వార్తలు

విశాఖ రైల్వే జోన్ ఇవ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 13: విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయవలసిందేనని తెలుగుదేశం లోక్‌సభ సభ్యుడు కింజారపు రామమోహన్ నాయుడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం గోయల్‌కు లేఖ రాశారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయటం సాధ్యం కాదంటూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి చేసిన ప్రకటన వలన ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉన్నదని రామమోహన్ నాయుడు హెచ్చరించారు. రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూలులో పొందుపరిచిన విధంగా విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేసి తీరవలసిందేనని ఆయన లేఖలో స్పష్టం చేశారు. రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవటం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల అభీష్టాన్ని గౌరవిస్తూ రైల్వే జోన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తెలుగుదేశం సభ్యుడు గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. జయదేవ్ మంగళవారం లోక్‌సభలో 377 నిబంధన కింద ఇచ్చిన నోటీసులో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఐదేళ్లు కాకుండా పదేళ్లు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు కేబీకే, బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి పన్ను రాయితీలను ఉతరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌తో సమానంగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి మూడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని, రానున్న ఐదేళ్లలో 43వేల కోట్లు విడుదల చేయవలసి ఉంటుందని జయదేవ్ సూచించారు.