జాతీయ వార్తలు

భావన..అవని...మోహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: భారత వాయుసేన చరిత్రలో నూతన అధ్యాయం మొదలైంది. ముగ్గురు మహిళలు తొలిసారిగా యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. శనివారం దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో జరిగిన 129వ గ్రాడ్యుయేటింగ్ ట్రైనీల పాసింగ్ ఔట్ పరేడ్‌లో కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ చేతుల మీదుగా శిక్షణ పూర్తయినట్లు పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా పారికర్ మాట్లాడుతూ భారత వాయుసేన చరిత్రలో అది సువర్ణ అక్షరాలతో లిఖించదిగిన రోజు అని పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా శిక్షణ తీసుకున్న ఈ ముగ్గురు మహిళలూ, 150 గంటలపాటు యుద్ధ విమానాలు నడపడంలో అనుభవం సంపాదించారు. ఆ ముగ్గురు పైలెట్లు.. భావనాకాంత్, అవని చతుర్వేది, మోహనా సింగ్. ఫ్లైయింగ్ ఆఫీసర్ హోదా పొందిన వీరు మరో ఆరు నెలలు అడ్వాన్స్‌డ్ జెట్ ఫైటర్.. బ్రిటిష్ హాక్‌లో ఫైటర్స్‌గా శిక్షణ పొందనున్నారు. కర్నాటకలోని బీదర్‌లో స్టేజి 3 శిక్షణ పొందిన తర్వాత సుఖోయ్, తేజాస్ యుద్ధ విమానాలను నడిపే స్ధాయికి చేరుకుంటారు.
సాహసమే ఊపిరి
భావనాకాంత్
బీహార్‌లోని దర్భంగ జిల్లాలో మారుమూల గ్రా మం నుంచి వచ్చిన భావనాకాంత్ (24) రాజస్థాన్‌లోని కోటలో ప్లస్ టూ పూర్తి చేసిన తర్వాత బెంగళూరులో బిఎంఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్‌లో మెడికల్ ఎలక్ట్రానిక్స్‌ను పూర్తి చేశారు. ఈ కోర్సు పూర్తయిన తర్వాత ఆమె ఎయిర్‌ఫోర్స్ సర్వీ సు కమిషన్‌లో చేరారు. పక్షిలాగా ఆకాశంలో ఎగరాలనే తాపత్రయం తనకు ఉండేదని, సాహసమైన క్రీడలంటే ఇష్టమని చెప్పారు.
కల నెరవేరింది
అవని చతుర్వేది
మధ్యప్రదేశ్ సాత్నా జిల్లాకు చెందిన అవని రేవా నగరానికి సమీపంలో డియోల్యాండ్‌లో స్కూలు విద్య అనంతరం బనస్తలి యూనివర్శిటీ నుంచి బిటెక్ కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ తీసుకున్నారు. ఆమె తండ్రి ప్రభుత్వ సర్వీసులో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ‘ఎప్పటికైనా యుద్ధపైలెట్ కావాలనే లక్ష్యంగా పెట్టుకున్నా. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది’ అని అవని చెప్పారు.

వాయుసేన అంటే ప్రాణం
మోహనాసింగ్
రాజస్థాన్‌లోని ఝుం ఝు న్ ప్రాంతానికి చెందిన మోహనాసింగ్ తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేస్తున్నారు. తల్లి ఉపాధ్యాయురాలు. న్యూఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ స్కూలులో పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత అమృతసర్‌లో జిఐఎంఇటిలో బిటెక్ ఎలక్ట్రానిక్స్ కోర్సు చదివారు. తన తండ్రి ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేయడం వల్ల ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఎయిర్‌ఫోర్స్‌లో చేరినట్లు మోహనాసింగ్ అన్నారు. తన తాత కూడా ఏవియేషన్ రీసెర్చి సెంటర్‌లో పనిచేసి ఉండటం తన అదృష్టమన్నారు.