జాతీయ వార్తలు

శశికళకు 15 రోజుల పెరోల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 20: అక్రమ ఆస్తుల కేసులో శిక్షపడి పరప్పన అహ్రారం జైలో ఉన్న అన్నాడీఎంకే నాయకురాలు వీకే శశికళకు 15 రోజుల పెరోల్ మంజూరైంది. చెన్నై ఆసుపత్రిలో చనిపోయిన భర్త నటరాజన్ (75) అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆమెకు అధికారులు అనుమతి ఇచ్చారు. నటరాజన్ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. తీవ్రమైన చాతి ఇన్‌ఫెక్షన్‌తో మూడు రోజుల క్రితం ఆయన ఆసుపత్రిలో చేరారు. నటరాజన్‌కు గత ఏడాది కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. శశికళ తమిళనాడులోని తంజావూర్ చేరుకుని భర్త అంత్యక్రియల్లో పాల్గొంటారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శశికళకు 15 రోజుల పెరోల్ మంజూరు చేసినట్టు పరప్పన అగ్రహారం సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ సోమశేఖర్ వెల్లడించారు. అయితే ఆమె ఎలాంటి బహిరంగ సభలు, రాజకీయ కార్యక్రమాలకు హాజరుకావడం లేదా మాట్లాడడం చేయకూడదని అన్నారు. అలాగే తంజావూర్ పరిధి దాటి ఎక్కడికి వెళ్లకూడదని స్పష్టం చేశారు. 66.6 కోట్ల అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలుశిక్ష పడింది.