జాతీయ వార్తలు

మరో పెరియార్ విగ్రహం ధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుదుకొట్టాయ్, మార్చి 20: తమిళనాట విగ్రహాల విధ్వంస పరంపర కొనసాగుతోంది. ద్రవిడ ఉద్యమ పితామహుడు, సంఘ సంస్కర్త ఈవీ రామసామి అలియాస్ పెరియార్ రామసామి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అరాచక మూకలు పెరియార్ విగ్రహం తలను ధ్వంసం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెవిన్యూ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పాడైన విగ్రహానికి యుద్ధప్రాతిపదికపై మరమ్మతులు చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. పెరియార్ రామసామి విగ్రహాన్ని ద్రవిడర్ కజగం నాయకుడు వీరమణి 2013లో ఏర్పాటు చేశారు. ద్రవిడ నేత విగ్రహం ధ్వంసం నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈనెల 6న వెల్లూర్ జిల్లాలో పెరియార్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ద్రవిడ నేత పెరియార్ విగ్రహ ధ్వంసంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.అమెరికాలో భారత నిపుణుల ర్యాలీ