జాతీయ వార్తలు

సభ ఆర్డర్‌లో లేదు.. చర్చ కుదరదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: లోక్‌సభలో శుక్రవారం దాదాపు 60 నుంచి 70 మంది ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నిలబడి మద్దతు ప్రకటించినా స్పీకర్ సుమిత్రా మహాజన్ టీడీపీ, వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను సభలో చర్చకు ప్రతిపాదించలేదు. సభ ఆర్డర్‌లో లేనందున అవిశ్వాస తీర్మానాన్ని సభ ముందు ప్రతిపాదించలేకపోతున్నానని స్పీకర్ ప్రకటించారు. లోక్‌సభలో టీడీపీ పక్ష నేత తోట నరసింహం, వైకాపా స భ్యుడు వైవీ సుబ్బారెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చ కోసం ప్రతిపాదించకపోవడం పై ప్రతిపక్షం తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్య క్తం చేసింది. రెండు పార్టీలు ప్రతిపాదించిన అ విశ్వాస తీర్మానాలకు తామంతా మద్దతు ఇస్తు న్నా చర్చకు చేపట్టడం లేదని కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, సీపీఎం నేత సలీం తదితరులు గట్టిగానే నిలదీశారు. అయితే స్పీకర్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఇంతమంది సభ్యులు పోడియం వద్ద నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలిస్తుంటే అవిశ్వాస తీర్మానాన్ని సభలో ఎలా ప్రతిపాదిస్తానని ఎదురు ప్రశ్నించారు. పో డియంను చుట్టుముట్టి గొడవ చేస్తున్న అన్నాడీ ఎంకే, టీఆర్‌ఎస్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘మీరంతా మీ మీ సీట్లలోకి వెళితే అవిశ్వా స తీర్మానాన్ని సభ ముందు పెడతాను’అని పలుమార్లు చెప్పారు. సభలో ఎవరు ఏం మా ట్లాడుతున్నారనేది తనకు వినిపించటం లేదని, అవిశ్వాస తీర్మానానికి ఎంతమంది మద్దతు ఇస్తున్నారనేది కనిపించడం లేదని మహాజన్ స్పష్టం చేశారు. సభ ఆర్డర్‌లోకి వస్తే తప్ప అవిశ్వాస తీ ర్మానాన్ని చేపట్టలేనని ఆమె చెప్పేశారు. అధికార పక్షం కూడా అవిశ్వాస తీర్మానంపై చర్చకు సం సిద్ధతను వ్యక్తం చేసింది కాబట్టి పోడియం వద్ద ఉన్నవారంతా తమ సీట్లలోకి వెల్లిపోవాలని సు మిత్రా మహాజన్ కోరారు.
లోక్‌సభ శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటి కే పోడియంను చుట్టుముట్టిన అన్నాడీఎంకే, టీ ఆర్‌ఎస్, ఇతర పార్టీల సభ్యుల ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో సభను స్తంభింపజేశారు. దీంతో ఆమె సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. లోక్‌సభ తిరిగి సమావేశం కాగానే సు మిత్రా మహాజన్ మొదట ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పింపజేశారు. అప్పటికే పోడియం వద్దకు చేరుకున్న టీఆర్‌ఎస్, అన్నాడీఎంకే స భ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. సభ్యులు నినాదాలతో సభ దద్దరిల్లిపోయింది. కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే, దేశ వ్యాప్తంగా ఒకే రిజర్వేషన్ విధానం అమలుచేయాలని టీఆర్‌ఎస్ స భ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ టీడీపీ, వైకాపా సభ్యులిచ్చి న అవిశ్వాస తీర్మానాల గురించి ప్రస్తావించగానే ఈ పార్టీలతో పాటు మొత్తం ప్రతిపక్షం సభ్యు లు తమ సీట్లలో నిలబడి తమ మద్దతు ప్రకటించారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సైతం తన సీట్లో నిలబడి అవిశ్వాస తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ అవిశ్వాస తీర్మానాలను సభలో ప్రతిపాదించి దీనికి 50మంది స భ్యుల మద్దతు ఉన్న దా? లేదా? అనేది నిర్ధారించుకోవడం తన విద్యుక్త ధర్మమని సుమిత్రా మహాజన్ ఉద్ఘాటించారు. పోడియం వద్ద నిలబడి నినాదాలు ఇస్తున్న సభ్యులు తమ సీట్లలోకి వెళితే అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తానని ఆ మె ప్రకటించారు. అధికార పక్షం కూడా అవిశ్వాస తీర్మానంపై చర్చకు సుముఖత వ్యక్తం చేసినందున సభ్యులు తమ సీట్లలోకి వెళ్లిపోవాలన్నారు. అలాగే సభ ఆర్డర్‌లోకి రాకపోతే అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టటం సాధ్యం కాదని ఆ మె తేల్చిచెప్పారు. పోడియంను చుట్టుముట్టిన టీఆర్‌ఎస్, అన్నాడీఎంకే సభ్యులు మాత్రం స్పీ కర్ ఆదేశాలను పట్టించుకోకుండా నినాదాలు కొనసాగించారు. అడుఅడుగునా సభా కార్యక్రమాలకు అడ్డుతగిలారు. తమ డిమాండ్లను ఆ మోదించవలసిందేనని వారు స్పష్టం చేశారు. సుమిత్రా మహాజన్ అవిశ్వాస తీర్మానాల గు రించి ప్రస్తావించగానే పోడియంను చుట్టుముట్టిన సభ్యులు తమ నినాదాల జోరు పెంచారు. చేసేది లేక స్పీకర్ సభను వచ్చే మంగళవారానికి వాయిదా వేసి వెళ్లిపోయారు.

చిత్రం..పోడియం వద్ద నినాదాలు చేస్తున్న సభ్యులను ఆపాలంటూ చెబుతున్న స్పీకర్ సుమిత్రా మహాజన్