జాతీయ వార్తలు

అంతిమ దశలో నక్సలిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్గావ్, మార్చి 24: దేశంలో నక్సలిజం అంతిమదశకు చేరుకుందని కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. అందుకే తీవ్ర నిరాశ, నిస్పృహలతోనే నక్సల్స్ మెరుపుదాడులకు, పిరికిపంద చేష్టలకు పాల్పడుతున్నారని అన్నారు. సీఆర్‌పీఎఫ్ 79వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నక్సల్స్ నిరోధక దళాలకు ఉద్దేశించి శనివారం ఇక్కడ మాట్లాడిన రాజ్‌నాథ్ ‘నక్సల్స్ నిరోధక దళాలు అత్యంత వ్యూహాత్మక రీతిలో పటిష్టమైన విధంగా చర్యలు చేపడుతున్నాయి. దీని ఫలితంగానే వామపక్ష ఉగ్రవాద తీవ్రత ఇటీవల కాలంలో గణనీయంగా తగ్గింది’ అని అన్నారు. అలాగే దళాల దాడుల్లో మరణిస్తున్న నక్సల్స్ సంఖ్య కూడా పెరిగిందని చెప్పారు. సైనిక దళాలు దాడులతో నక్సల్స్ కేడర్ ఆత్మస్థయిర్యాన్ని కోల్పోయిందని నేరుగా దాడులు చేయలేక తమ పరిమిత శక్తితో మెరుపుదాడులకు పాల్పడుతున్నారని హోమ్‌మంత్రి స్పష్టం చేశారు. ఇటీవల చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మందుపాతరకు బలైన 9 మంది జవాన్లకు నివాళులు అర్పించిన రాజ్‌నాథ్ ‘దేశంలో నక్సలిజం తీవ్రత గణనీయంగా తగ్గడానికి కారణం సైనిక దళాలు తమ పట్టును మరింత బిగించడమే. ఒకప్పుడు నక్సల్స్ దాడుల్లో మరణించిన సైనికులే ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు సైనిక దాడుల్లో నక్సల్సే పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు’ అని తెలిపారు. పేదలు, గిరిజనులు అభివృద్ధికి నక్సలైట్లు వ్యతిరేకమన్న వాస్తవాన్ని ప్రజలు గ్రహించారని అందుకే ఉద్యమం చివరిదశకు చేరుకుందని చెప్పారు. కాశ్మీర్‌లోయ, ఈశాన్య భారతం సహా తీవ్రవాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సైనిక దళాలు బహముఖంగా తమ సత్తాను చాటుకోవల్సిన అవసరం ఉందన్నారు.

చిత్రం..సీఆర్‌పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గుర్గావ్‌లో గౌరవ వందనం స్వీకరిస్తున్న రాజ్‌నాథ్ సింగ్