జాతీయ వార్తలు

సాహో..ఇస్రో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, మార్చి 29: రోదసీ పరిశోధనలో ఇస్రో మరో సరికొత్త రికార్డు సృష్టించింది. అంతరిక్ష ప్రయోగాల వినీలాకాశాలంలో భారత త్రివర్ణపతాకం మరోమారు రెపరెపలాడింది. స్వదేశీ క్రయోజనిక్‌తో మరోసారి మన శాస్తవ్రేత్తలు సత్తాచాటారు. ఇస్రో కీర్తికిరీటంలో మరో కలిగితురాయి చేరింది... అంతరిక్షంలో భారత్ మరోమైలురాయిని అధిగమించింది... దేశంలో శక్తివంతమైన సమాచార వ్యవస్థను సొంతం చేసుకొనే కలల సాకారాన్ని మన శాస్తవ్రేత్తలు నిజం చేశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కదనాశ్వం జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 08 ప్రయోగం మరోసారి విజయబావుటా ఎగరవేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి ప్రయోగించిన జీశాట్-6ఏ ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ వాహక నౌక విజయవతంగా నింగిలోకి మోసుకెళ్లింది. దీంతో క్రయోజనిక్ ప్రయోగాల్లో ఇస్రో ఆరోసారి వరుసగా విజయం సాధించడమే కాకుండా శాస్తవ్రేత్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ప్రయోగం కోసం నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్)లో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట 57 నిమిషాలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 27గంటలు నిరాటకంగా కొనసాగింది. ఆ తరువాత గురువారం సాయంత్రం సరిగ్గా 4గంటల 56నిమిషాలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుడి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 08 రాకెట్ ఎరుపు, నారింజ రంగుల్లో నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. కొంతసేపు ఉత్కంఠ నెలకొన్నా స్వదేశీ క్రయోజనిక్ ప్రయోగాల్లో జీఎస్‌ఎల్‌వీ మరో విజయాన్ని నమోదు చేసింది. జీఎస్‌ఎల్‌వీ వాహక నౌక జీశాట్-6ఏ ఉపగ్రహాన్ని 17.46నిమిషాల్లో నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ఈ రాకెట్ ద్వారా పంపిన జీశాట్-6ఏ కమ్యూనికేషన్ శాటిలైట్‌ను భూమిక దగ్గరగా (పెరిజి) 170కి.మీ, దూరంగా (అపోజి) 35,975కి.మీ ఎత్తులో 20.63డిగ్రీల ఏటవాలులో రోదసీలోకి ప్రవేశపెట్టారు. అనంతరం ఉపగ్రహంలో ఇంధనాన్ని మండిస్తూ భూమికి 36వేల కి.మీ ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ విజయంతో ఇస్రో కీర్తి ప్రతిష్టలు ఇతర దేశాలకు పాకాయి. దేశంలో సమాచార రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇస్రో శాస్తవ్రేత్తలు కమ్యూనికేషన్ రంగానికి చెందిన ఉపగ్రహాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసి ప్రయోగించారు. ఈ విజయంతో సమాచార రంగానికి మరింత ఊతమిచ్చినట్లుయ్యింది. ఈ ఉపగ్రహం 10సంవత్సరాలు పాటు సేవలు అందించనుంది. ఈ ఉపగ్రహంలో అమర్చిన ఎస్ బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్లను మోబైల్ బ్యాండ్ సేవలకు ఉపయోగపడుతుంది. దీంతో పాటు దేశ రక్షణ రంగానికి కూడా దీని సేవలు అందించనున్నట్లు ఇస్రో శాస్తవ్రేత్తలు తెలిపారు. జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఇది 12వ ప్రయోగం కాగా ఈ ఏడాది రెండో ప్రయోగం కావడం విశేషం. జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఎంతో సంక్లిష్టమైన క్రయోజనిక్ దశను స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో మన శాస్తవ్రేత్తలు రూపకల్పన చేసి విజయం సాధిస్తున్నారు. ఈ ప్రయోగ విజయంతో ప్రపంచ దేశాలు సైతం భారత్ వైపు చూస్తున్నాయి. అంకేకాకుండా మునుముందు భారీ రాకెట్ ప్రయోగాలకు మార్గం సుగమమం అయ్యింది. ఈ క్రయోజనిక్ ప్రయోగాల్లో ఇది ఆరో ప్రయోగం. ఈ దశ అన్ని ప్రయోగాలు విజయవంతమవ్వడంతో మన శాస్తవ్రేత్తల సాంకేతిక సామర్ధ్యాన్ని ఏమిటో ఇట్టే తెలుస్తోంది. ఈ ప్రయోగం కోసం ఇస్రో రూ.270కోట్ల వ్యయాన్ని ఖర్చుచేశారు.

రాకెట్ విడిపోయింది ఇలా...
ప్రయోగ సమయంలో 415టన్నుల బరువు, 49.1మీటర్ల ఎత్తున్న జీఎస్‌ఎల్‌వీ రాకెట్ మూడు దశల్లో ప్రయోగం జరిగింది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 08 రాకెట్ తన అన్ని దశలను సునాయసనంగా పూర్తి చేసుకొని చివరిల్లో ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా చేర్చింది. మొదట దశ ఘన ఇంధనంతో 0.0తో ప్రారంభమై స్ట్ఫ్రాన్ మోటార్లతో నింగివైపు కదలిన రాకెట్ 2.31నిమిషాలకు 72కి.మీ ఎత్తులో సెకనకు 2393.2కి.మీ వేగంతో పూర్తి చేసింది. అక్కడ నుంచి రెండో ద్రవ ఇంధనంతో 4.41నిమిషాలకు ప్రారంభమై సెకనకు 3438.1కి.మీ వేగంతో 115.5కి.మీ ఎత్తులోకి పోయినంతరం తన రెండో దశను 3.45నిమిషాలకు పూర్తిచేసుకొంది. అత్యంత కీలకమైన మూడో దశ క్రయోజనిక్ ఇంధనంతో 4.46నిమిషాలకు ప్రారంభమై సెకనకు4934కి.మీ వేగంతో ప్రారంభమైన 133.47కి.మీ ఎత్తుకు చేరినంతరం రాకెట్ 17నిమిషాలకు మూడో దశ పూర్తయ్యింది. అనంతరం రాకెట్ సెకనకు 9743కి.మీ వేగంతో 243కి.మీ ఎత్తులోకి పోయినంతరం చివరిలో ఉన్న జీశాట్-6ఏ ఉపగ్రహాన్ని 17.46నిమిషాలకు 254కి.మీ ఎత్తులో రోదసీలోకి విడిచిపెట్టింది.