జాతీయ వార్తలు

న్యాయవ్యవస్థ స్వేచ్ఛ ప్రమాదంలో పడింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, జస్టిస్ చలమేశ్వర్ రాసిన లేఖ నేపథ్యంలో లాయర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థలోకి చొరబడుతున్న కార్యనిర్వాహక వ్యవస్థ విషయంలో పూర్తి కోర్టును ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ చలమేశ్వర్, ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు లేఖ రాశారు. ‘హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నేరుగా కలుగజేసుకుంటోందన్న అంశాన్ని జస్టిస్ చలమేశ్వర్ లేఖ స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థ స్వేచ్ఛ పూర్తిగా ప్రమాదంలో పడిందన్న సత్యాన్ని ఈ లేఖ ధ్రువీకరిస్తోంది’ అని అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఎఐఎల్‌యు) ఒక ప్రకటనలో పేర్కొంది.
జిల్లా సెక్షన్స్ జడ్జి కృష్ణ్భట్‌కు పదోన్నతికి కొల్లీజియం సిఫారసును పక్కనబెట్టి, కేంద్ర న్యాయశాఖ అభ్యర్థన మేరకు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, భట్‌పై విచారణ జరిపించడంపై దేశవ్యాప్తంగా న్యాయవాదుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నదన్నది. ‘కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కార్యనిర్వాహక శాఖ ఒత్తిళ్లకు లొంగిపోయి వినయవిధేయతలతో పనిచేయడం, ప్రజాస్వామ్యానికి జరుగుతున్న హానికి ఉదాహరణ అని ప్రకటన పేర్కొంది. ప్రస్తుత ప్రభుత్వం కావాలనే న్యాయవ్యవస్థ స్వేచ్ఛను దెబ్బతీస్తోంది. కొద్ది మంది న్యాయమూర్తులు దాన్ని ప్రేరేపిస్తునారని ఆ ప్రకటనలో లాయర్ల సంఘం ఆరోపించింది. ఒక న్యాయమూర్తి తాను చేసిన ప్రమాణానికి, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. ఇందులో ఏవిధమైన భయానికి తావులేదు. కానీ కర్నాటక ప్రధాన న్యాయమూర్తి ఈ విషయంలో విఫలమయ్యారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని ప్రకటన స్పష్టం చేసింది.