జాతీయ వార్తలు

మోదీజీ.. వారియర్స్-2 రాయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విసురుతున్న సెటైర్లు తూటాల్లా పేలుతూనే ఉన్నాయి. తాజాగా సీబీఎస్‌ఇ పరీక్ష పేపర్ల లీకులపై ఆయన వాగ్బాణాలు సంధించారు. ‘ఎగ్జామ్ వారియర్స్’ పుస్తకానికి ప్రధాని మోదీ సీక్వెల్ రాయబోతున్నారని, అందులో పరీక్ష పేపర్ల లీకుల కారణంగా జీవితం నాశనమైపోయిన విద్యార్థులు ఆ ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో చిట్కాలు చెబుతారంటూ రాహుల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌కు మోదీ పిల్లలతో ఆడుతున్న ఫొటోను జతచేయడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ‘పరీక్షల ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో విద్యార్థులకు చిట్కాలు చెబుతూ ప్రధాని మోదీ ఇప్పటికే ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాన్ని రాశారు. ఇప్పుడు దీనికి ఎగ్జామ్ వారియర్స్-2 సీక్వెల్ రాయబోతున్నారు. ఎగ్జామ్ పేపర్లు లీకైన కారణంగా జీవితం నాశనమైపోతే, ఆ ఒత్తిడి నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలా బయటపడాలో ఇందులో చిట్కాలు చెప్పబోతున్నారు’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలకు ముందు మన్ కీ బాత్‌లో మాట్లాడిన మోదీ, ఎగ్జామ్ ఒత్తిడితో ఎలా యుద్ధం చేయాలో విద్యార్థులకు సూచనలు చేయడం తెలిసిందే. టెన్త్ మ్యాథ్స్, ఇంటర్ ఎకనామిక్స్ పేపర్లు లీకైన నేపథ్యంలో, బోర్డు రీ ఎగ్జామ్ ప్రకటన చేసిన దగ్గర్నుంచీ కేంద్రంపై కాంగ్రెస్ విరుచుకుపడుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే హెచ్‌ఆర్‌డి మంత్రి జావడేకర్, సీబీఎస్‌ఈ చైర్మన్ అనితా కర్వాల్‌ను పదవుల నుంచి తప్పించి, హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. అలాగే, గుడ్ ఫ్రైడే సందర్భంగా రాహుల్ మరో ట్వీట్ చేస్తూ ‘ప్రేమ, శాంతితో ప్రతి ఒక్కరూ హాయిగా జీవించాలి’ అని ఆకాంక్షించారు. సీబీఎస్‌ఈ పేపర్ల లీకుపై గురువారం చిత్రమైన ట్వీట్ చేస్తూ ‘మన సేవకుడు బలహీనపడ్డాడు’ అని వ్యాఖ్యానించడం తెలిసిందే.
ఇదిలావుంటే, పరీక్ష పేపర్ల లీకుల అంశాన్ని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ సీరియస్‌గా తీసుకోవాలని ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియా సూచించారు. మరోసారి ఇలాంటి పొరబాటు జరగకుండా రాష్ట్రాల విద్యా శాఖా మంత్రులతో సమావేశం నిర్వహించి కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. లీకుల అంశంపై హెచ్‌ఆర్‌డి మంత్రి ప్రకాష్ జవడేకర్‌కు లేఖ రాస్తూ, రాజకీయాలను పక్కనపెట్టి ఇలాంటి సన్నితమైన, తీవ్రమైన సమస్యలపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఏ ప్రభుత్వంలోనైనా, ఏ పాలకులు ఉన్నా సీబీఎస్‌ఈ, ఎస్సెస్బీ, డిఎస్సెస్బీ.. ఇలా ప్రతిసారీ ఏదోక పరీక్ష పేపర్ లీకవ్వడం దేశ ప్రతికూల పరిస్థితిని స్పష్టం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మొన్నటి సీబీఎస్‌ఈ పేపర్ల లీకును ప్రస్తావిస్తూ, ఈ పరిస్థితిని చక్కదిద్దుకోకపోతే విద్యార్థులకు పరీక్షల మీదే నమ్మకం పో తుందని సిసోడియా ఆందోళన వ్యక్తం చేశారు.