జాతీయ వార్తలు

ముష్కరుల ఏరివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఏప్రిల్ 1: కశ్మీర్‌లో విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణ కశ్మీర్‌లో ఆదివారం జరిగిన మూడు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 12మంది ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. షోఫియాన్‌లో గత ఏడాది లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్‌ను అతి కిరాతకంగా హతమార్చిన కేసులో నిందితులను ఈ ఎన్‌కౌంటర్లలో మట్టుబెట్టి భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. కాగా ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మరో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. షోఫియాన్ జిల్లాలోని కచడూరు, డ్రగ్గాడ్, దక్షిణ కాశ్మీర్‌లోని దయాల్గామ్‌లో ఆదివారం తెల్లవారుజామునుంచి ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయ. కాగా కచడూరు ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. సైన్యం, పోలీసు, సీఆర్‌పీఫ్ దళాలతో కలసి జమ్ముకాశ్మీర్ డీజీపి ఎస్‌పి వేద్ హడావుడిగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘటనల వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో ఇటీవలి కాలంలో ఇదే అతి పెద్ద చర్య అన్నారు. జమ్ముకాశ్మీర్‌లో హిజ్‌బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా ఎక్కువగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. వీరి కార్యకలాపాలను అడ్డుకునేందుకు సైన్యం, పోలీసులు సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. కాగా షోఫియాన్‌లోని కచడూరులో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదుల మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
అవంతిపురలోని విక్టర్ ఫోర్స్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కమాండర్ లెఫినెంట్ ఎకె భట్ మాట్లాడుతూ గత ఏడాది లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్‌ను కిరాతకంగా హతమార్చిన కేసులో నిందితులు ఇషాఫ్ మాలిక్, రరుూస్ థోకర్‌లను బద్రతా బలగాలు మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకున్నాయన్నారు. కాగా దయాల్గామ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ సందర్భంగా ఉగ్రవాదులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని డీజీపీ వివరించారు. అక్కడ ఇద్దరు ఉగ్రవాదులు నక్కినట్టు గుర్తించిన పోలీసులు వారిని లొంగిపోవాల్సిందిగా కోరారు. వారిలో ఒక ఉగ్రవాదిని గుర్తించి అతడి కుటుంబ సభ్యులతో అరగంట సేపు మాట్లాడించి లొంగిపోయే అవకాశం కల్పించినట్లు ఆయన చెప్పారు. అయితే అతడు వినిపించుకోకుండా పోలీసులపై కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిపామని, అతడు హతమవగా మరో ఉగ్రవాది సజీవంగా పట్టుబడ్డాడని వేద్ తెలిపారు.
షోఫియాన్ జిల్లాలోని డ్రగ్గాడ్, కచడూర ఎన్‌కౌంటర్లలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం ఉందన్న డీజీపీ ఎదురుకాల్పుల్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్య 4 లేదా ఐదుగురిగా ఉండవచ్చునని, కచ్చితంగా ఇప్పుడే చెప్పలేమని అన్నారు. కచడూరలో ఎదురుకాల్పుల సందర్భంగా 25మందికి పెల్లెట్, ఆరుగురికి బుల్లెట్ గాయాలయ్యాయని, దీనితో అక్కడ విధ్వంసం చోటుచేసుకుందని ఆయన చెప్పారు. డ్రగ్గాడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన ఏడుగురు మిలిటెంట్లు స్థానికులేనని, మృతులను వారి బంధువులు గుర్తించారని ఆయన చెప్పారు. ఉగ్రవాదానికి యువత ఆకర్షితులై ఇలా బలవడాన్ని చూసి బాధకలుగుతోందని, హింసామార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చేలా యువకుల తల్లిదండ్రులు స్పందించాలని డీజీపీ అన్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాల్లోకి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారని, అయినా ఉగ్రవాద వ్యతిరేక చర్యలను నిలిపివేసే ప్రసక్తే లేదని సీఆర్‌పీఎఫ్ ఐజీ జుల్ఫికర్ హసన్ అన్నారు.
చిత్రం..షోఫియాన్‌లో ఉగ్రవాదులను మట్టుబెట్టి తిరిగి వస్తున్న జవాన్లు