జాతీయ వార్తలు

ఇస్రోకు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఏప్రిల్ 1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు (ఇస్రో) కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగాల్లో మరోసారి పెద్ద షాక్ తగిలింది. షార్ కేంద్రం నుంచి మార్చి 29న ప్రయోగించిన అధునాతన ఉపగ్రహం జీశాట్-6ఏను జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 08 రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాన్ని కర్ణాటక రాష్ట్రంలోని హసన్ మాస్టర్ కంట్రోల్ కేంద్రం నుంచి శాస్తవ్రేత్తలు లామ్ ఇంజిన్ సాయంతో ఆదివారం 53 నిమిషాల పాటు ఇంధనాన్ని మండించి మూడో దశ కక్ష్య పెంచారు. మళ్లీ నాలుగో దశ కక్ష్య పెంచే సమయంలో ఇస్రోకు జీశాట్-6ఏతో సంబంధాలు తెగిపోయి సంకేతాలు అందలేదు. యధావిధిగా సంకేత సంబంధాలు తీసుకొచ్చేందుకు శాస్తవ్రేత్తలు ఎంతసేపు ప్రయత్నించినా ఫలించలేదు. ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన సమాచార రంగానికి చెందిన జీశాట్-6ఏ ఉపగ్రహ సంకేతాలు మూడు రోజులకే తెగిపోవడంతో శాస్తవ్రేత్తలు నిరాశ చెందారు. అంతేకాకుండా ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్‌కు ఇది తొలి ప్రయోగం కావడంతో విజయం సాధించిన మూడు రోజులకే ఉపగ్రహ సేవలు నిలిచిపోవడంతో ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. షార్ నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 08 రాకెట్ జీశాట్-6ఏ ఉపగ్రహాన్ని విజయవంతంగా మోసుకెళ్లి నిర్దేశిత కక్ష్యలోకి 17.46 నిమిషాలకు చేర్చింది. ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి చేరిన అనంతరం కర్టాటకలోని హసన్ మాస్టర్ ఫెసిలిటీ కేంద్రం తమ ఆధీనంలోకి తీసుకుని పర్యవేక్షిస్తుంది. అనంతరం అందులో ఇంధనాన్ని మండించి ఉపగ్రహ కక్ష్యను పెంచుతుంటారు. ఈనేపథ్యంలోనే ఈనెల 30న మొదటి దశ కక్ష్య పెంచే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. 30న ల్యామ్ ఇంజిన్‌లో
ఇంధనాన్ని మండించి తొలి విడత ఉపగ్రహాన్ని కక్ష్య పెంచే ప్రక్రియను విజయవంతంగా చేపట్టారు. ఉదయం 9 గంటల 22 నిమిషాలకు ఈ ప్రక్రియను ప్రారంభించి 10 గంటల వరకు దాదాపు అరగంటకు పైగా వివిధ దశల్లో ఉపగ్రహాన్ని కక్ష్యను పెంచే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇదే తరహాలో మార్చి 31న రెండో దశ ఉపగ్రహ కక్ష్య పెంపు కార్యక్రమాన్ని 53 నిమిషాలపాటు ఇంధనాన్ని మండించి ఉపగ్రహ కక్ష్యను విజయవంతంగా పెంచారు. ఇదే క్రమంలో ఆదివారం ఉపగ్రహ చివరి దశ కక్ష్య పెంచే కార్యక్రమంలో మొదట రెండు దశలను విజయవంతంగా పెంచారు. మూడో దశ పెంచి నాలుగోసారి పెంచేందుకు ప్రయత్నించే సమయంలో ఇస్రో శాస్తవ్రేత్తలకు, ఉపగ్రహానికి మధ్య సంబంధాలు తెగిపోయాయి. శాస్తవ్రేత్తలు ఎంతసేపు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అధికారికంగా ప్రకటించారు. ఇస్రో శాస్తవ్రేత్తలు మాత్రం ఉపగ్రహం నుంచి సంకేత సంబంధాలు పునరుద్ధరించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇస్రో ప్రయోగించిన అధునాతన ఉపగ్రహ ప్రయోగాల్లో జీశాట్-6ఏ రెండోవది. 2015 ఆగస్టు 27న ప్రయోగించిన జీశాట్-6 ఉపగ్రహ ప్రయోగం కూడా విజయవంతమైంది. దీని సేవలు తొమ్మిది సంవత్సరాలపాటు అందించే విధంగా ఇస్రో రూపొందించారు. కాని ప్రయోగించిన రెండున్నర సంవత్సరానికే ఆ ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తి సంకేతాలు అందలేదు. దీంతో జీశాట్-6కు అనుబంధంగా ఇస్రో దాని స్థానంలో జీశాట్-6ఏ అధునాతన ఉపగ్రహాన్ని పంపించారు. ఇది ఆదిలోనే సాంకేతిక లోపం తలెత్తడంతో ఎన్నడూ లేని విధంగా ఇస్రోకు భారీ షాక్ తగిలినట్లైయ్యింది. ఈ ప్రయోగానికి ఇస్రో దాదాపు 400 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది.
చిత్రం..ఇస్రో ప్రయోగించిన జీశాట్-6ఏ ఉపగ్రహం