జాతీయ వార్తలు

అవిశ్వాసం... అక్కడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంపై తెలుగుదేశం, వైకాపాతోపాటు ఇతర ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలు సోమవారం కూడా చర్చకు రాకపోవచ్చు. లోక్‌సభలో తెలుగుదేశం పక్షం నాయకుడు తోట నరసింహం, వైకాపా సభ్యుడు సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డితోపాటు కాంగ్రెస్, వామపక్షాలు, ఎంఐఎం, ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసులను లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలతకు పంపించారు. అన్నాడీఎంకే సభ్యులు కావేరీ నదీ జలాల యాజమాన్యం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో సోమవారం లోక్‌సభలో స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి గొడవ చేస్తారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు పోడియం వద్దకు వెళ్లి గొడవ చేయటం మానివేయటంతో ఇప్పుడు కేవలం అన్నాడీఎంకె సభ్యులు మాత్రమే అవిశ్వాస తీర్మానంపై చర్చకు అడ్డుపడుతున్నారు. అన్నాడీఎంకె సభ్యులు సోమవారం కూడా ఎప్పటిలానే పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో గొడవ చేస్తే అవిశ్వాస తీర్మానాలపై నేడు కూడా చర్చ జరగకపోవచ్చు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ఇది ఆఖరు వారం. ఈ వారంతంలో అంటే శుక్రవారంతో బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ పోడియం వద్ద గొడవ చేస్తున్న అన్నాడీఎంకె సభ్యులను తొలగించేందుకు మార్షల్స్‌ను ప్రయోగించకపోవచ్చు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిపేందుకు అడ్డుపడుతున్న అన్నాడీఎంకె
సభ్యులను మార్షల్స్ సహాయంతో సభ నుండి తొలగించాలని ప్రతిపక్షానికి చెందిన కొందరు సభ్యులు సూచించారు. అయితే స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ ప్రతిపాదనను తన ముందుకు వచ్చిన వెంటనే తిరస్కరించినట్లు తెలిసింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ వారాంతంలో ముగుస్తున్నందున ఆఖరున అన్నాడీఎంకె సభ్యులను బలవంతంగా సభ నుండి తొలగించి అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపటం మంచిది కాదని ఆమెతోపాటు బీజేపీ అధినాయకత్వం కూడా భావిస్తోంది. అవిశ్వాస తీర్మానంపై చర్చకు తాము సిద్ధమేనని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇప్పటికి పలుమార్లు సభలో ప్రకటించారు. అయితే వారు అన్నాడీఎంకె సభ్యులను బుజ్జగించే పని మాత్రం చేయలేదు. అందుకే లోక్‌సభలో నేడు అన్నాడీఎంకె సభ్యులు పోడియం వద్దకు వచ్చి గొడవ చేస్తే మార్షల్స్ సహాయంతో తొలగించేందుకు సుమిత్రా మహాజన్ ఇష్టపడకపోవచ్చు. అన్నాడీఎంకె సభ్యులను మార్షల్స్ సహాయంతో తొలగించే బదులు సభను వాయిదా వేసేందుకే సుమిత్రా మహాజన్ ఇష్టపడతారని అంటున్నారు.