జాతీయ వార్తలు

అదే దారిలో అన్నాడీఎంకే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నిన్నమొన్నటి వరకూ కావేరీ అంశంపై పార్లమెంట్‌లో నిరసన తెలిపిన అన్నాడీఎంకె, ఇప్పుడు కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనకు పదును పెడుతోంది. కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికే పక్షంలో ఎన్డీయే సర్కారుపై తాము అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తామని అన్నాడీఎంకె నాయకుడు తంబిదురై తెలిపారు. కావేరీ అంశానికి సంబంధించి కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని డీఎంకే నాయకుడు స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని తంబిదురై తెలిపారు. అయితే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటే తమకు కాంగ్రెస్ పార్టీ మద్దతు అవసరమని లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ కూడా అయిన తంబిదురై వెల్లడించారు. అయితే తమ తీర్మానం కేవలం కావేరీ అంశానికే సంబంధించింది అయి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.