జాతీయ వార్తలు

సీబీఎస్‌ఈ అధికారి సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ పరీక్ష పత్రాల లీక్ వ్యవహారం ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్న నేపథ్యంలో కేంద్ర జనశక్తి వనరుల మంత్రిత్వశాఖ బోర్డు అధికారులను సస్పెండ్ చేసింది. ఈ లీక్ వ్యవహారంలో మరో ముగ్గురిని అరెస్టు చేసింది. వీరిలో ఇద్దరు ఓ ప్రైవేటు స్కూల్ టీచర్లు కావడం గమనార్హం. పరీక్ష పత్రాల లీక్ వ్యవహారంతో వీరికి సంబంధం ఉందన్న ఆరోపణలు రావడంతో ఈ అరెస్టులు చేసింది. మరోపక్క పనె్నండో తరగతి ఎకనామిక్స్ పేపర్ ఏ విధంగా బహిర్గతమైందన్న దానిపై దర్యాప్తు ప్రక్రియను చేపట్టింది. ప్రతిష్టాత్మకమైన సీబీఎస్‌ఈ పరీక్షాపత్రాలు బహిర్గతం కావడంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌తోపాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా తీవ్ర ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం తక్షణ చర్యలను చేపట్టింది. ఈ వ్యవహారంలో ప్రధాని నరేంద్రమోదీ వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి కూడా పెరుగుతోంది. ప్రాథమికంగా ఇప్పటివరకు జరిగిన దర్యాప్తును బట్టి చూస్తే డబ్బు కోసం కాకుండా ఇద్దరు స్కూలు టీచర్లు తమ మధ్య ఉన్న స్నేహానికి ప్రతీకగానే పనె్నండో తరగతి పరీక్ష పత్రాలను ఓ కోచింగ్ సెంటర్ ట్యూటర్‌కు లీక్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నామని, మరింత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
ఔటర్ ఢిల్లీలోని బవానాలోని ప్రైవేటు స్కూల్‌లో పనిచేస్తున్న టీచర్లు రిషభ్, రోహిత్‌లతోపాటు ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో పనిచేస్తున్న తక్వీర్ ఈ పేపర్ల లీకేజీ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి గంట ముందుగా తనవద్ద ట్యూషన్ చదువుతున్న విద్యార్థులకు తన్వీర్ ఎకనమిక్స్ ప్రశ్నపత్రాన్ని పంపిణీ చేశాడు. ఆ తరువాత తన స్నేహితుల ద్వారా ఇతరులకు అందేలా చేశాడు. టీచర్లు రిషభ్, రోహిత్‌ల ద్వారా వాట్సాప్‌లో ప్రశ్నపత్రాన్ని పొందిన తక్వీర్ ఈ అక్రమానికి పాల్పడ్డాడని జాయింట్ కమిషనర్ (క్రైమ్) అలోక్ కుమార్ వివరించారు. ప్రశ్నపత్రాల బండిల్‌ను విప్పినవెంటనే ఉదయం 9.45 గంటల సమయంలో ఇద్దరూ వాటిని ఫొటో తీసి వాట్సాప్‌లో తక్వీర్‌కు పంపారని, సీబీఎస్‌ఈ ఇచ్చిన నాలుగు వాట్సాప్ నెంబర్ల ద్వారా నిందితులను పసిగట్టామని ఆయన చెప్పారు.

చిత్రం..పోలీసుల అదుపులో టీచర్లు రిషభ్, రోహిత్