జాతీయ వార్తలు

చంద్రబాబు హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పార్లమెంట్ హాలు వేదికగా ప్రధాని మోదీపై యుద్ధం ప్రకటించారు. మంగళవారం పార్లమెంటు సెంట్రల్ హాల్లో దాదాపు రెండున్నర గంటలపాటు బైఠాయించి విభజిత ఏపీకి ప్రధాని మోదీ చేస్తున్న అన్యాయాన్ని విపక్ష నేతలకు సోదాహరణంగా వివరించారు. రాష్ట్ర ప్రజల హక్కుల సాధనకు సహకరించాలని అన్ని పార్టీల నేతలకు విజ్ఞప్తి చేశారు. సహకార ఫెడరలిజానికి విరుద్ధంగా వ్యవహరిస్తోన్న మోదీని ఓడించేందుకు భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ ఒకటి కావాలని చంద్రబాబు కోరారు. ఉదయం 11.15కు పార్లమెంటులోకి అడుగుపెట్టిన చంద్రబాబు, సెంట్రల్ హాల్లో రెండున్నర గంటలపాటు ఓపిగ్గా గడిపారు. బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, వాపక్షాలు, అన్నాడీఎంకే, శివసేన, డీఎంకే, ఎన్డీయే మిత్రపక్షాల సీనియర్లు, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు దాదాపు 50మందిని విడివిడిగా కలిసి మోదీపై ఫిర్యాదులు చేశారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తోన్న అన్యాయం, అవమానాలను పూసగుచ్చినట్టు వివరించారు. మోదీ వైఖరిపై నేషనల్ మీడియా ముందూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు సెంట్రల్ హాల్లో కూర్చుని వివిధ పక్షాల నేతలతో మాట్లాడుతున్నప్పుడు అటువైపే వెళ్లిన ప్రధాని మోదీ, చంద్రబాబును తలెత్తి కూడా చూడలేదు. ఇదిలావుంటే రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఒకవైపు వివరిస్తూనే, అందుకు కారణమైన
నరేంద్ర మోదీని ఓడించేందుకు వివిధ పక్షాలు అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాన్నీ పలువురు సీనియర్లతో చంద్రబాబు చర్చించారు. బాబు అభిప్రాయాలకు పలువురు సీనియర్లు ఆమోదముద్ర వేశారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుజనా చౌదరి, లోక్‌సభలో తెలుగుదేశం పక్షం నాయకుడు తోట నరసింహం, రాజ్యసభలో పార్టీపక్షం ఉప నాయకుడు సీఎం రమేష్, యువ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, కేసినేని నాని, టీజీ వెంకటేష్, మాగంటి బాబు, మురళీమోహన్ తదితరులు వివిధ పక్షాలకు చెందిన సీనియర్లు, ఎంపీలను చంద్రబాబుకు పరిచయం చేశారు. చంద్రబాబు హల్‌చల్‌తో సెంట్రల్ హాల్లోవున్న అందరి దృష్టీ ఆయనపైనే ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు ముందుభాగంలో కూర్చుని పలువురు నేతలతో మంతనాలు సాగిస్తుంటే, మరోవైపు వైకాపా ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, వరప్రసాద్‌రావు, పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ కూడా సెంట్రల్ హాల్లో బైఠాయించారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, ఏపీ విభజన చట్టం రూపకర్త జైరాం రమేష్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం ఉపనాయకుడు జ్యోతిరాదిత్య సింథియా, పనబాక లక్ష్మి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే, నేషనల్ కాన్ఫరెన్స్ అధినాయకుడు ఫరూఖ్ అబ్దుల్లా, లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ పక్షం నాయకుడు సుదీప్ బందోపాధ్యాయ, రాజ్యసభలో టీఎంసీ పక్షం నాయకుడు డెరిక్ ఓబ్రేయిన్, బీజేపీ సీనియర్ నాయకుడు మురళీమనోహర్ జోషి, సీపీఐ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు డి రాజా, అన్నాడీఎంకే లోక్‌సభ పక్షం నాయకుడు వేణుగోపాల్, కేంద్ర మంత్రులు హర్దీప్‌సింగ్ పురి, హర్‌సిమ్రన్‌జీత్ కౌర్, రాందాస్ అథావలే, లోక్‌సభలో తెలంగాణ రాష్ట్ర సమితి పక్షం నాయకుడు జితేందర్ రెడ్డి, ఎంపీ కవిత, విశే్వశ్వర్ రెడ్డి చంద్రబాబును కలిశారు. ఎన్సీపీ నాయకుడు తారిక్ అన్వర్, బీజేపీ ఎంపీ హేమామాలిని, ఎస్పీ నాయకుడు రాంగోపాల్ యాదవ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వీ, విజయ్‌దర్దా, మైత్రేయన్ తదితరులతోనూ చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించటం ద్వారా పెద్ద తప్పు చేశారని చంద్రబాబు కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ వద్ద వ్యాఖ్యానించినపుడు, మీరంతా వ్యక్తం చేసిన అభిప్రాయాల ఆధారంగానే రాష్ట్రాన్ని విభజించామంటూ ఆయన ప్రత్యుత్తరమిచ్చారు.

చిత్రాలు..సెంట్రల్ హాల్లోకి వెళ్తూ పార్లమెంట్ మెట్లకు మొక్కుతున్న చంద్రబాబు.. ప్రధాని మోదీ ఓటమికి ఎన్సీపీ నేత శరద్‌పవార్‌తో వ్యూహరచన చేస్తున్న చంద్రబాబు