జాతీయ వార్తలు

సవాల్‌కు సిద్ధమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ తెదేపా ప్రభుత్వ హయాంలో పది అంశాల్లో సీబీఐ దర్యాప్తునకు సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేశ్ సిద్ధమా? అని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు, రాజధాని భూకుంభకోణా లు, తాత్కాలిక సచివాలయం, భూ కేటాయింపులు, చంద్రబాబు విదేశీ పర్యటనలు, కాల్‌మనీ సెక్స్ రాకెట్, హెరిటేజ్, అగ్రిగోల్డ్, ఓటుకు నోట్లు, ఐఎంజీ భారత్ అంశాల్లో సీబీఐ దర్యాప్తు జరిపితే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లు జైలుకు వెళ్తారని అన్నారు. తనపై అర్ధంలేని విమర్శలు చేస్తున్న లోకేశ్ తీరును ఆయన ఎండగట్టారు. లోకేశ్ చిత్తశుద్ధి, నిజాయితీవుంటే తాము లేవనెత్తిన అంశాల్లో సీబీఐ విచారణ జరిపించుకుని నిర్దోషిగా బయటకు రావాలని సవాల్ విసిరారు. గతంలో జనసేన అధ్యక్షుడు పవన్ మంత్రి లోకేశ్‌పై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు మొదట ప్యాకేజీ గురించి మాట్లాడి, ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ యూ టర్న్ తీసుకున్నారని, అందుకే ఆయనను అంతా ‘యూ టర్న్ అంకుల్’ అంటున్నారని విమర్శించారు. పార్లమెంట్‌లో జాతీయ నాయకుల చేతులు పట్టుకుని మరీ తమ సీఎంను కలవాలని తెదేపా ఎంపీలు వేడుకున్నారని, కాళ్లు మాత్రం పట్టుకోవడం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం జాతీయ నేతలు గుంటూరుకు వస్తే వారిపై చంద్రబాబు వర్గీయులు రాళ్లు, టమాటాలు, కోడిగుడ్లు వేయించారని అన్నారు. విశ్వసనీయత గల ఒక రాజకీయ నాయకుడిగా చంద్రబాబును జాతీయ నేతలు ఎవరూ పరిగణించడం లేదన్నారు. తాను ఎప్పటికీ వైఎస్ కుటుంబం మనిషినేనని ఆయన స్పష్టం చేశారు. లోపాయికారీ ఒప్పందాలు చేసుకోవడం చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేశ్‌కు మాత్రమే అలవాటని, తనకు అలాంటి అలవాటు లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
వైఎస్సార్సీపీ ఎంపీల నిరసన
ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు కోరుతూ పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద వైఎస్సార్సీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎంపీలు మేకపాటి రాజామోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, వరప్రసాద్, అవినాశ్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.