జాతీయ వార్తలు

టెన్త్ పరీక్ష నిర్వహించబోము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పదవ తరగతి గణితశాస్త్ర పేపరుకు తిరిగి పరీక్ష నిర్వహించడంలేదని కేంద్ర మానవ వనరుల శాఖ మంగళవారం ప్రకటించింది. పాఠశాల విద్యావిధానంలో సీబీఎస్‌ఈ తరగతుల్లో 10వ తరగతి కేవలం ‘ఆంతరంగిక సెగ్మెంట్’ మాత్రమే అయినందువల్ల పరీక్షను తిరిగి నిర్వహించాల్సిన అవసరం లేదని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఢిల్లీ, నేషనల్ కేపిటల్ రీజియన్, హర్యానా ప్రాంతాలకు చెందిన రెండు లక్షలమంది విద్యార్థులకు ఉపశమనం కలిగింది. మార్చి 28న జరిగిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 16 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పదో తరగతి పేపర్ లీకేజీ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీని ప్రభావంపై ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పరీక్ష తిరిగి నిర్వహించవద్దని నిర్ణయించామంటూ కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి అనీల్ స్వరూప్ పేర్కొన్నారు.