జాతీయ వార్తలు

మోదీజీ! వౌనమేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివమొగ్గ (కర్నాటక), ఏప్రిల్ 3: ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి విమర్శల దాడి చేశారు. వ్యంగ్యం, ఆగ్రహం, చురకలతో ఆయన విమర్శలు కొనసాగాయి. షెడ్యూల్డు కులా లు, తెగలపై పెరుగుతున్న దాడులపైన, ఎస్‌సీఎస్‌టీ అట్రాసిటీయాక్ట్ నిర్వీర్యంపైన ప్రధా ని మోదీ ఒక్కమాట కూడా మాట్లాడలేదెందుకుని రాహుల్ ప్రశ్నించారు. శాసనసభ ఎన్నికలు జరగనున్న కర్నాటకలోని శివమొగ్గలో జరిగిన బహిరంగ సభలో మంగళవా రం మాట్లాడిన రాహుల్‌గాంధీ మోదీపై ప దునైన విమర్శలు గుప్పించారు. దళితసంఘాల ఆధ్వర్యంలో సోమవారం జరిగిన భా రత్‌బంద్ హింసాత్మకంగా మారిన సంఘటనలపై స్పందించిన రాహుల్‌గాంధీ మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘దళిత వర్గానికి చెందిన రోహిత్ వేములను హత్య చేశా రు. గుజరాత్‌లోని ‘ఉన’లో దళితులను చా వబాదారు. అయినా ప్రధానమంత్రి మోదీ ఆయా సంఘటనలపై ఒక్కమాట కూడా అనలేదు. మాట్లాడకపోవడమే ఆయనకు ఇ ష్టం’ అని రాహుల్ విమర్శించారు. దేశంలో దళితులపై రోజురోజుకూ దాడులు పెరుగుతన్నాయని, ఎస్‌సీఎస్‌టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్న రాహుల్ సీబీఎస్‌ఈ పశ్నపత్రాలు లీక్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ కర్నాటక ఎన్నికల తేదీ ‘లీక్’ అయిందని, వీటిపై మోదీ స్పందించరెందుకని ప్రశ్నించారు.
మోదీ పాఠాలు చెప్పారు కానీ..
పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలో వివరిస్తూ ప్రధాని నరేంద్రమోదీ ‘ఎగ్జామ్ వారియర్స్’ పుస్తకాన్ని రాశారని, రెండు గంటలపాటు ప్రసంగించారని గుర్తుచేసిన రాహుల్ ఆ మాటలు విన్న విద్యార్థినీవిద్యార్థులు దీక్ష తో శ్రద్ధగా పరీక్షలకు సిద్ధమయ్యారని అన్నా రు. అయితే పరీక్షాకేంద్రానికి వెళ్లాక విద్యార్థులకు, వారి తల్లిదండ్రలకు ప్రశ్నపత్రాల లీ క్, పరీక్షల వాయిదా విషయం తెలిసిందని, కానీ మోదీ ఈ వ్యవహారంపై నోరు మెదపరని రాహుల్ విమర్శించారు. అయినప్పటికీ మోదీ మళ్లీ విద్యార్థులకు పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో వివరించగలరని రాహుల్ ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పడం, చేతుల్లో కర్ర లు పట్టుకొని, నిక్కర్లు ధరించడం వంటి వి షయాల్లో మోదీకి ఆర్‌ఎస్‌ఎస్ పాఠాలు బో ధిస్తున్నట్టుందని రాహుల్ విమర్శించారు. ఏ వగించుకోవడం, లాఠీలు, ఉపన్యాసాలు, అ బద్ధపు హామీలతో దేశాన్ని నడపలేమన్న వా స్తవాన్ని ప్రధాని మోదీ ఇప్పటికైనా గ్రహించి ఉంటారని భావిస్తున్నట్లు రాహుల్ అన్నారు.
డోక్లాం వివాదంపై కూడా రాహుల్ మో దీపై చురకలు అంటించారు. వివాదం చెలరేగిన సమయంలో చైనా అధ్యక్షుడితో చక్క ర్లు కొట్టిన మోదీ ఆ ప్రభావం నుంచి ఇంకా బయటపడలేదని, మరోవైపు చైనా డోక్లాం లో రహదార్లు, విమానాశ్రయాలు నిర్మిస్తోందని అన్నారు. ‘56 అంగుళాల ఛాతీ’ ఈ వి వాదంపై ఒక్క మాటకూడా ఎందుకు అనలేదని రాహుల్ ప్రశ్నించారు. కాగా కర్నాటక లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భావిస్తు న్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్పనూ రాహుల్ విడిచిపెట్టలేదు. శివమొగ్గ యడ్యూరప్ప స్వస్థలం. బీజేపీ వేదికలపై మోదీకి ఒకవైపు జైలులో గడిపిన యడ్యూరప్ప, మరోవైపు జైలుకు వెళ్లిన మరో నలుగురు మంత్రులు కూర్చున్న విషయాన్ని ప్ర స్తావించిన రాహుల్, అవినీతి గురించి ఏముఖం పెట్టుకుని మోదీజీ మాట్లాడతారని ప్రశ్నించారు. అయితే ఇప్పుడిప్పుడే బీజేపీ నేతలు నిజాలు చెబుతున్నారని, యడ్యూరప్ప ప్రభుత్వం అత్యంత అవినీతిమయమైనదని అమిత్‌షా ప్రకటించడంపట్ల సంతోషపడుతున్నానని రాహుల్ అన్నారు. షా తన జీవితంలో మొదటిసారి నిజం చెప్పారని రా హుల్ అన్నారు. మార్చి 27న జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన అమిత్‌షా క ర్నాటకలో అధికారంలో ఉన్న సిద్దరామ య్య ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వంగా చెప్పబోయి యడ్యూరప్ప ప్రభు త్వం అని వ్యాఖ్యానించారు. మరుక్షణం ఆ వ్యాఖ్యను సరిచేశారు. ఈ విషయాన్ని రా హుల్ ఇప్పుడు ప్రస్తావిస్తూ తనదైన శైలిలో విమర్శలు చేశారు. తాను ఇందిర, రాజీవ్, పీవీ, వాజ్‌పేయ్ వంటి ప్రధానులను చూశానని, దేశాన్ని ప్రేమతో సమున్నత శిఖరాలకు తీసుకువెళ్లవచ్చన్నది స్పష్టమని, ప్రజలతో మరింత మమేకం అవడం ద్వారా అది సా ధించవచ్చని రాహుల్ అన్నారు. బహిరంగ సభకు ముందు శివమొగ్గలో రోడ్‌షోలో పా ల్గొన్న రాహుల్‌కు భారీఎత్తున ప్రజలు స్వాగతం పలికారు.

చిత్రం..కర్నాటకలోని షిమోగాలో నిర్వహించిన జన సంపర్క యాత్రలో కార్యకర్తలతో కరచాలనం చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, చిత్రంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య