జాతీయ వార్తలు

రాజ్యసభ సభ్యులుగా 41మంది ప్రమాణస్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన సభ్యులు 41 మంది మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యులు సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్ ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఉన్నారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రస్తుత బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీఎల్ నర్సింహరావు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నుంచి ఎన్నికై నేడు ప్రమాణస్వీకారం చేశారు.
వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎన్నికైన వారితో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో అత్యధికంగా 23 మంది బీజేపీ రాజ్యసభ సభ్యులు ఉండగా, కాంగ్రెస్ నుంచి ఆరుగురు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు, తెలుగుదేశం, ఆర్జేడీ, జేడీ(యు) పార్టీల నుంచి ఇద్దరు చొప్పున, ఎన్సీ పీ, శివసేన నుంచి ఒక్కరు చొప్పున ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఉన్నారు. వీరిలో తిరిగి రాజ్యసభకు ఎన్నికైన వారు 18 మంది ఉన్నారు. టీడీపీ సభ్యులు సీఎం రమేష్ ఇంగ్లీష్‌లో, రవీంద్రకుమార్ తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన ఎంపీలు అందరినీ చైర్మన్ వెంకయ్యనాయుడు కరచాలనం చేసి అభినందించారు. ఆ సమయంలో ప్రధాని నరేంద్రమోదీ కూడా రాజ్యసభలోనే ఉన్నారు.
విపక్ష సభ్యుల ఆందోళనలతో మంగళవారం నాడు కూడ సభ కార్యకలపాలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తి కాగానే వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పత్రాలను సభకు సమర్పించాలని చైర్మన్ కోరారు. ఈ సమయంలో టీడీపీ, అన్నాడీఎంకే, డిఎంకే, కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపారు.
ఈ పరిస్థితుల్లో చైర్మన్ వెంకయ్య మాట్లాడుతూ మీరు లేవనేత్తే అంశాలపై చర్చించేందుకు సభ సిద్ధంగా ఉందని, సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. సభ్యులు వెన క్కి తగ్గకపోవడంతో చైర్మన్ బుధవారం నాటికి సభను వాయిదా వేసి వెళ్లిపోయారు.