జాతీయ వార్తలు

30 మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, ఏప్రిల్ 9: హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా నర్పూర్ సమీపంలోని ఓ లోయలోకి స్కూలు బస్సు దొర్లిపడిన ప్రమాదంలో 26 స్కూలు పిల్లలు సహా 30 మంది దుర్మరణం చెందారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన వారిలోఎక్కువ మంది పిల్లలేనని అధికార వర్గాలు తెలిపాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతానికి హుటాహుటిన తరలివెళ్లి సహాయక చర్యలు చేపట్టామని నర్పూర్ సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ అబిద్ హుస్సేన్ తెలిపారు. 30 మంది ఈ ప్రమాదంలో మరణించిన విషయాన్ని విద్యా మంత్రి సురేశ్ భరద్వాజ్ ధ్రువీకరించారు. అయితే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తిగా దెబ్బతిన్న బస్సు నుంచి ఇంకా చాలామందిని వెలికితీయాల్సి ఉందని రాత్రి పొద్దుపోయిన తర్వాత అధికారులు తెలిపారు. ఈ స్కూలు బస్సు వజీర్ రామ్‌సింగ్ మెమోరియల్ పబ్లిక్ స్కూలుకు చెందినదిగా కాంగ్రా ఎస్పీ సంతోష్ పటియాల్ తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో చాలా సన్నని మలుపు ఉండడంవల్ల బస్సు డ్రైవర్ అదుపు తప్పిందని, దాంతో 200 అడుగుల లోతైన ఓ లోయ ప్రాంతంలోకి పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. కాగా సహాయక చర్యల నిమిత్తం జాతీయ విపత్తుల సహాయ బృందం దళాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రిని ప్రమాద స్థలానికి పంపామని, ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు ముఖ్యమంత్రి రాం ఠాకూర్ వెల్లడించారు. మరణించిన పిల్లల వయస్సు 5 నుంచి 11 సంవత్సరాల లోపేనని తెలుస్తోంది.

చిత్రం..హిమాచల్‌లో జరిగిన ప్రమాద ప్రాంతానికి తరలివచ్చిన సహాయక సిబ్బంది