జాతీయ వార్తలు

మహాత్మా.. నువ్వే స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ తెలుగుదేశం ఎంపీలు మహాత్మాగాంధీ సమాధి వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. సోమవారం ఉదయం టీడీపీ లోక్‌సభ పక్ష నాయకుడు తోట నర్సిహం నివాసంలో ఎంపీలు సమావేశమయ్యారు. తరువాత ప్రత్యేక బస్సులో ఎంపీలందరూ మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్ వద్దకు చేరుకుని జాతిపితకు
నివాళులర్పించి శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రత్యేహోదా సాధనకు శాంతియుత నిరసనలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ నిరసన దీక్షలో ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్‌రావు, తోట సీతారామలక్ష్మి, కనకమేడల రవీంద్రబాబు, టీజీ వెంకటేష్, అశోక్‌గజపతిరాజు, రామ్మోహన్‌నాయుడు, అవంతి శ్రీనివాస్, పి.రవీంద్రబాబు, మాగంటి మురళీమోహన్, మాగంటి బాబు, కె.నారాయణ, గల్లా జయ్‌దేవ్, కేశినేని నాని, శ్రీరాం మాల్యాద్రి, జేసీ
దివాకర్‌రెడ్డి, నిమ్మల కిష్టప్ప, బుట్టా రేణుక పాల్గొన్నారు.
తెల్ల దుస్తులు ధరించిన తెలుగుదేశం ఎంపీలు జాతీయ జెండా చేతబట్టి దీక్ష సాగించారు. అనంతరం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధనలో భాగంగా దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ చేపట్టిన శాంతియుత పోరాట బాటలోనే తామూ ముందుకు సాగుతామన్నారు. రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలు సాధించుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తరువాత తోట నర్సిహం ఇంటివద్ద విలేఖరులతో మాట్లాడారు. ఏపీ ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాజీనామా చేయించామని చెబుతున్న వైఎస్‌ఆర్‌సీపీ ముందు రాజ్యసభలో ఉన్న ఇద్దరు ఎంపీలతో ఎందుకు రాజీనామాలు చేయించలేదని జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఎంపీలు రాజీనామా చేస్తే పార్లమెంట్‌లో ఎవరు పోరాటం చేస్తారని ప్రశ్నించిన జగన్ మోహన్‌రెడ్డి మరిప్పుడు రాజీనామాలు చేయించడానికి కారణమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీనామాలతో ఆ పార్టీ బీజేపీతో లాలూచీ రాజకీయాలు బయటపడ్డాయని ఆయన పేర్కొన్నారు. తాము ఎన్ని విధాలుగా పోరాటం చేసినా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్టించుకునే పరిస్థితులు లేవని జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు.
మాజీ కేంద్ర మంత్రి అశోక్‌గజపతి రాజు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరగడానికి రెండు జాతీయ పార్టీలు కారణమయ్యాయని, విభజన సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేసి, ఇప్పుడు ఏపీకి అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం చేయాల్సిన అవసరం ఉందని అశోక్‌గజపతి రాజు అన్నారు.