జాతీయ వార్తలు

మమ్మల్నే శంకిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బీజేపీతో కుమ్మక్కయితే కేంద్రంపై తామెందుకు పోరాటం చేస్తామని, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ఎందుకు పెడతామని వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ దేశ రాజధానిలో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరహారదీక్ష సోమవారానికి నాలుగో రోజుకు చేరుకుంది. ఏపీ అంటే కేంద్రానికి లెక్కలేదని, ఇతర రాష్ట్రాలకు వేలకోట్ల ఆర్థిక సహాయం ప్రకటిస్తూ, ఏపీకి మాత్రం హామీలను సైతం అమలు చేయడం లేదని ఆరోపించారు. పార్లమెంట్ చేసిన చట్టాలకే విలువ లేదా?
అని కేంద్రాన్ని నిలదీశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికుంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తిచేసేవారని, రాయలసీమకు నీళ్లుకూడా వచ్చేవని విజయమ్మ అన్నారు. దీక్ష చేస్తున్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని సోమవారం వైద్యులు పరీక్షించి దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు. అయితే సుబ్బారెడ్డి ససేమిరా అనడంతో ఢిల్లీ పోలీసులు బలవంతంగా రాంమనోహర్ లోహియా అస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీలు వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డిలను పరామర్శించారు. ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ హోదాకోసం పోరాడుతున్న వైఎస్ జగన్‌ను అరెస్టు చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తామంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. రాష్ట్రానికి నిధులివ్వకుండా ఏపీని విస్మరిస్తున్న టీడీపీ, బీజేపీలకు కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుందని అన్నారు. ఏపీ హక్కుల కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయకపోతే తరిమికొట్టాలని ఆమె ప్రజలకు పిలుపిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ల హక్కునే అడుగుతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని కొత్తగా ఏమీ కోరికలు కోరడం లేదని జేడీయూ బహిష్కృత నాయకుడు శరద్ యాదవ్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, అది వారి హక్కని, ఎన్నికల ముందు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామిని హామీ ఇచ్చి బీజేపీ మోసం చేసిందని శరద్ యాదవ్ ఆరోపించారు.

చిత్రం..వైకాపా దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న శరద్ యాదవ్.. దీక్ష నుంచి సుబ్బారెడ్డి తరలింపు