జాతీయ వార్తలు

సంక్షేమం పట్టని విపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోతీహరి, ఏప్రిల్ 10: దేశాభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఎన్‌డీఏ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే విపక్షాలు అవి అమలుకాకుండా ప్రతిబంధకంగా మారాయని మంగళవారం బిహార్‌లో జరిగిన ఓ సభలో విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి, అసాంఘిక శక్తులపై పోరాడుతున్నారని మోదీ ప్రశంసించారు. అయితే కొన్ని శక్తులు అభివృద్ధికి ఆటంకం కల్పిస్తున్నాయని ఆర్జేడీ,కాంగ్రెస్‌పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. సమాజంలో మార్పులు తీసుకొచ్చేందుకు సీఎం నితీష్ తీసుకున్న చర్యలకు కేంద్రం సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించారు. పార్లమెంటు వీధుల దగ్గర నుంచి రహదారులను దిగ్బంధనం చేస్తూ ప్రతిపక్షాలు ప్రతిదాన్నీ అడ్డుకుంటున్నాయని ప్రధాని ధ్వజమెత్తారు. దేశంలో అట్టడుగు వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. ఇరవైవేల మందితో జరిగిన స్వచ్ఛాగ్రహ (క్లీన్‌లీనెస్ వాలంటీర్స్)ను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. చంపారన్ సత్యాగ్రహా శతవార్షికోత్సవంలో ప్రధాని మాట్లాడుతూ ప్రజల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేస్తూ ప్రతిపక్షాల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పరిరక్షణ
పేరుతో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటన నేపథ్యంలో మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బిహార్ సీఎం కుమార్ సమాజ ఉద్ధరణ కోసం పాటుపడుతుంటే కొందరు అవరోధాలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. సమాజంలో మార్పులు వారికి నచ్చడం లేదని ఆర్జేడి-కాంగ్రెస్‌ను ఉద్దేశించి విరుచుకుపడ్డారు.‘పేదలు బాగుపడితే తమ మనుగడ కష్టమని కొన్ని శక్తులు భయపడుతున్నాయి. అబద్ధాలతో పక్కదోవ పట్టిస్తున్న వారికి ఇవి రుచించడం లేదు’అని ఆయన అన్నారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడానికి విపక్షాలు చేస్తున్న కుట్రలు సాగవని మోదీ తీవ్రంగా హెచ్చరించారు. 50 నిముషాల సుదీర్ఘ ప్రసంగంలో ప్రధాని పలు సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించారు. భోజ్‌పురిలో ప్రసంగం ప్రారంభించిన మోదీ ‘మారుమూల ప్రాంతాల అభివృద్ధి సర్వతోముఖాభివృద్ధికి బిహార్ ప్రభుత్వం పాటుపడుతోంది. అయితే మా ప్రతిపక్షాలకు ఇది నచ్చడం లేదు’అని విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా రహదారులు, రైల్వేలు, పెట్రోలియం, శానిటేషన్‌కు సంబంధించి పలు పథకాలను ప్రధాని ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ కృషిని ఈ సందర్భంగా మోదీ ప్రశంసించారు. వచ్చే గాంధీ జయంతి నాటికి 8 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేయాలని ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, ఉప ముఖ్యమండ్రి సుశీల్ కుమార్ మోదీని కోరినట్టు ఆయన స్పష్టం చేశారు. దేశం యావత్తూ బిహార్‌పైవే చూస్తోందన్నారు. ‘చంపారన్ సత్యాగ్రహ ఉద్యమం ఇక్కడే ప్రారంభమైంది. ఆచార్యా వినోభాభావే భూదానోద్యమం ఇక్కడే మొదలెట్టారు. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా బిహార్ నుంచి మహోజ్యాల పోరాటం నడిపారు’అని మోదీ గుర్తుచేశారు. ఇన్ని ప్రత్యేకతలున్న బిహార్ అనేక అంశాల్లో కీలక భూమిక పోషించిందని పేర్కొన్నారు. ప్రధాని మోదీతోపాటు వేదికపై సీఎం నితీష్‌కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్‌కుమార్ మోదీ, బిహార్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, కేంద్ర మంత్రులు రామ్‌విలాస్ పాశ్వాన్, ఉమా భారతి, రవిశంకర్ ప్రసాద్, రాధామోహన్ సింగ్, గిరిరాజ్ సింగ్, అశ్వినీకుమార్ ఛుబే, ఎస్‌ఎస్ అహ్లూవాలియా ఆశీనులయారు.
చిత్రం..బిహార్‌లోని మోతీహరి వద్ద మహాత్ముని విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాని మోదీ, రాష్ట ముఖ్యమంత్రి నితీశ్ ప్రభృతులు