జాతీయ వార్తలు

రక్తం చిందిన రహదార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి/సిమ్‌డెగా(జార్ఖండ్): దేశంలోని రెండు రాష్ట్రాల్లో జాతీయ రహదారులు నెత్తురోడాయి. 27 మంది దుర్మరణం పాలయ్యారు. 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక ప్రమాదానికి ట్రక్కు బోల్తాకారణం కాగా, మరో ప్రమాదానికి బస్సు పల్టీ కొట్టడం కారణం. రెండు సంఘటనలు దాదాపు తెల్లవారు జామునే జరగడం గమనార్హం. డ్రైవర్లు స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదాలు సంభవించాయని పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రెండు సంఘటనల్లోనూ, వాహనాలు తిరగబడటమే ప్రమాదానికి కారణం కావడం గమనార్హం. మహారాష్టల్రో జరిగిన ప్రమాదానికి డ్రైవర్ నిద్రలోకి జారుకోవడం కారణం కాగా, జార్ఘండ్‌లో స్టీరింగ్ కంట్రోల్ తప్పి వాహనం తిరగబడిందని పోలీసు వర్గాలు
తెలిపాయి. మహారాష్టల్రోని సతారా జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో 18 మంది మరణించగా, గాయపడిన 15 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలోని బీజాపూర్ జిల్లానుంచి నిర్మాణ కూలీలను, పూణెకు తీసుకెళుతున్న ట్రక్కు తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ముంబయి-బెంగళూరు రహదారిపై ప్రమాదానికి గురైంది. ‘ఖంబట్కీ ఘాట్ సెక్షన్‌ను దాటిన తర్వాత ‘ఎస్’ ఆకారంలో మలుపు వస్తుంది. ఇక్కడ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. బహుశా డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకొని సీరింగ్‌పై నియంత్రణ కోల్పోవడంతో ట్రక్కు రోడ్డుపక్కన బ్యారీకేడ్లను ధ్వసం చేసి పల్టీకొట్టిందని’ సతారా ఎస్‌పి సందీప్ పాటిల్ వెల్లడించారు. ‘కూలీల వద్ద నిర్మాణానికి అవసరమైన ఇనుప సామగ్రి ఉన్నది. ట్రక్కు బోల్తాపడినప్పుడు వీరిపై ఈ సామను పడటం వల్ల తలపై గాయాలు తగిలి చాలా మంది మరణించారు’ అని ఆయన తెలిపారు. క్షతగాత్రులను సతారా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
మరో సంఘటనలో జార్ఖండ్‌లోని సిమ్‌డెగా జిల్లా, అధర్మా గ్రామం వద్ద బస్సు బోల్తాపడిన సంఘటనలో 9 మంది దుర్మరణం పాలుకాగా, మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. కమ్‌దరా నుంచి వస్తున్న ఈ బస్సు డ్రైవర్ మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత నియంత్రణ కోల్పోవడంతో ఒక్కసారిగా బోల్తాపడిందని పోలీసులు తెలిపారు. ముఖ్యమంత్రి రఘువర్‌దాస్ మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున నష్టపరిహారం ప్రకటించగా, సిమ్‌డెగా పాలనా యంత్రాంగం కూడా ప్రమాద బాధితుల కుటుంబాలకు రూ.20వేల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది.