జాతీయ వార్తలు

యోగిని ‘చెప్పులతో కొట్టండి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 15: కర్ణాటకలో ఎన్నికల ప్రచార కార్యక్రమం వ్యక్తిగత దూ షణలతో మరింతగా దిగజారిపోతోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్రానికి వచ్చినప్పుడు చెప్పులతో కొట్టండి అంటూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండూరావు ప్రజలకు పిలుపునివ్వడంతో పెద్ద దుమారమే రేగింది. ఉన్నావో, కథువా అత్యాచార సంఘటనలకు నిరసన గా రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శన సందర్భంగా గుండూరావు ఈ వివాదాస్పాద వ్యాఖ్యలు చేశారు. దీంతో భాజపా కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆవిధంగా వ్యా ఖ్యానించడం హీనాతిహీనమని పేర్కొం టూ, కాంగ్రెస్ హింసను ప్రేరేపిస్తున్నదం టూ భాజపా నేతలు ఆరోపించారు. అయి తే వివాదం ముదరడంతో గుండూరావు వె నక్కి తగ్గారు, ‘ఆదిత్యనాథ్ వచ్చినప్పుడు చెప్పులు చూపించండి అన్నా. కేవలం తాత్కాలిక ఉద్రేకంలో అన్నమాటలివి’ అం టూ సమర్థించుకోవడానికి యత్నించారు. ఈ వ్యాఖ్యలు నేరపూరితమైతే, తక్షణమే వెనక్కి తీసుకుంటానన్నారు. గతరాత్రి ఆ యన నిరసన ర్యాలీలోప్రసంగిస్తూ, ‘యూ పీ నుంచి ఇక్కడికి వచ్చే ఈయన యోగి కా దు భోగి, కపటి, అబద్ధాలకోరు, దోపిడీ దొంగ..కర్ణాటకలోకి ఆయన్ను అనుమతించొద్దు. ఒకవేళ వస్తే చెప్పులతో కొట్టి తిప్పి పంపాలి. ప్రధానికి ఆత్మగౌరవం ఉంటే, మ హిళలను గౌరవిస్తే, యూపీ సీఎంని తక్షణ మే పదవినుంచి తొలగించాలి’ అన్నారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు యెడ్యూరప్ప దీనిపై తీవ్రంగా స్పందిస్తూ, ‘ఆదిత్యనాథ్, నాథ్ సంప్రదాయానికి చెందిన గొప్ప యో గి. గుండూరావు వ్యాఖ్యలు అనాగరికం’ అన్నారు. ఒక ‘సన్యాసి’ గురించి ఏవిధంగా మాట్లాడాలో అతనికి తెలియదు. ప్రజాస్వా మ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడు ప్రజా జీ వనంలో మమేకం కావడానికి వీల్లేదా?’ అంటూ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. రా హుల్ గాంధీ తక్షణమే గుండూరావును పార్టీనుంచి బహిష్కరించాలని ఆయన డి మాండ్ చేశారు. గుండూరావు రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని కోరారు.
కాగా కర్ణాటక భాజపా ఈవిధంగా ట్వీ ట్ చేసింది, ‘గుండూరావు గారూ, మీకు ముస్లింలపై ప్రేమ ఉండవచ్చు. కానీ అది హిందువులపై ద్వేషంగా మారకూడదు. యోగి ఆదిత్యనాథ్‌ను చెప్పులతో కొట్టాలని ఏ ఉద్దేశంతో పిలుపునిచ్చారు? ఆయన్ను హిందూ ఒక్కళిగలు అత్యంత గౌరవంగా చూస్తారు. మరి మీ వ్యాఖ్యలతో ఈ వర్గం వారిని మీరు అవమానించారు.’ నిజానికి లింగాయత్‌లలో ఒక్కళిగలు అతిపెద్ద వ ర్గం కావడంతో ప్రస్తుతం కాంగ్రెస్ ఇరకాటంలో పడింది.