జాతీయ వార్తలు

మంత్రుల రాజీనామా, సీఎం ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఏప్రిల్ 15: కథువాలో 8 ఏళ్ల ముస్లిం బాలిక అత్యాచారం, హత్య కేసు లో నిందితులకు మద్దతుగా ర్యాలీలో పా ల్గొన్న ఇద్దరు వివాదాస్పద భాజపా మం త్రుల రాజీనామాను జమ్ము-కశ్మీర్ ము ఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆమోదించారు. మంత్రులు లాల్ సింగ్, ఛందర్ ప్రకాశ్ గంగలు సమర్పించిన రాజీనామాలను, తక్షణమే ఆమోదించిన మెహబూబా ముఫ్తీ, గవర్నర్‌కు పంపారు. వీరి రాజీనామాలతో రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల సంఖ్య 22కు తగ్గిపోయింది. ప్రస్తుతం మంత్రిమండలిలో మూడు ఖాళీలు ఏర్పడ్డాయి. గత నెలలో ఆర్థిక మంత్రి హసీబ్ ద్రబును ముఖ్యమంత్రి పదవినుంచి తొలగించారు. రాష్ట్ర భాజపా ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, అక్కడి ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత ఇద్దరు మం త్రులు రాజీనామాలు చేస్తారని ప్రకటించారు. ఆవిదంగా ఆయన రాజకీయ సం క్షోభాన్ని నివారించగలిగారు. కాగా ము ఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. ముఖ్యంగా మరింత రాజకీయ సంక్షోభం చోటు చేసుకోకుండా నివారించబడటం తో ఆమె ఊపిరి పీల్చుకున్నారు. ఈ దురదృష్టకర సంఘటన జమ్ము-కశ్మీర్ ప్రజ లు, మిగిలిన దేశవాసులను ఒకే తాటిపైకి తీసుకొచ్చిందని ఆమె అన్నారు.