జాతీయ వార్తలు

పీఎన్‌బీ స్కాంలో సీఏలకు నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 15: పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాడీ శాఖకు సంబంధించిన చట్టబద్ధమైన ఆడిటర్లు, క్రమశిక్షణా సంఘం ముందుకు హాజరు కావాని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంట్స్ ఇండియా (ఐసీఏఐ) నోటీసులు జారీచేసింది. 2011-12 నుంచి 2016-17 మధ్యకాలంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాడీ శాఖకు ఆడిటర్లుగా పనిచేసిన వారి జాబితాను ఐసీఏఐ రూపొందించింది. ఈ కుంభకోణంలో చార్టెడ్ అకౌంటెట్స్ పాత్ర ఏమైనా ఉన్నదీ లేనిదీ తెలుసుకునేందుకు ఈ విచారణ జరుపుతున్నట్టు ఐసీఏఐ సభ్యుడు ఎస్.బి. జావేర్ తెలిపారు. ఈ కాలంలోబ్రాడీ శాఖకు ఎనిమిది మం ది ఆడిటర్లు పనిచేశారు. ఆడిటర్లు విచారణకు హాజరై సమాధానాలు చెప్పిన తర్వాత ఈ స్కాంలో వారి పాత్రపై క్రమశిక్షణా సంఘం ఒక నిర్ణయానికి వస్తుందని జావేర్ తెలిపారు. ఇదిలావుండగా, పీఎన్‌మీ స్కాం బయటకు రాగానే ఐసీఏఐ అత్యున్నతస్థాయి గ్రూపును నియమించి, స్కాం గురించి సవివరమైన నివేదిక ఇవ్వాలని కోరారు. ఈ గ్రూపు తన అధ్యయనాన్ని పూర్తిచేసి బ్యాంకింగ్ వ్యవస్థ మరింత పటిష్టానికి అవసరమైన సలహాలిస్తుంది.