జాతీయ వార్తలు

చరిత్రను తిరగరాయాల్సిన అవసరం లేదు : జమ్‌ఖేద్కర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశ చరిత్రను పూర్తిగా తిరగరాయాల్సి న అవసరం లేదని, కొన్నిచోట్ల ‘అవసరమైన దానికంటే అతిగా’ చూపిన అంశాలను సవరిస్తే సరిపోతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ఐసీహెచ్‌ఆర్) ఛైర్మన్ అరవింద్ జమ్‌ఖేద్కర్ పేర్కొన్నారు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ (హెచ్‌ఆర్‌డి) కింద ఐసీహెచ్‌ఆర్ పనిచేస్తుంది. కాగా చరిత్ర లేదా పా ఠ్య ప్రణాళిక ఈవిధంగా ఉండాలని ఐసీహెచ్‌ఆర్ నిర్దేశించలేద ని, కాకపోతే చరిత్రను తిరిగి రాయడానికి అవసరమై పరిశోధనా కార్యక్రమాలను ప్రోత్సహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. చరి త్ర అనేక యుగాలుగా విభజించబడింది. ఒక్కో కాలంలో ఒక్కో రీతిలో ఇది వ్యక్తమవుతోంది. ‘వలసవాద చరిత్రను రాసే సమయంలో దాన్ని ఒక ప్రత్యేక కోణంలో లిఖించాలి. ముఖ్యంగా ప్రొ. బీబీ కౌశాంబి చెప్పినట్టు, ఈ కాలంలో ఆర్థిక చరిత్ర చదవకపోతే, అసలు చరిత్ర అధ్యయనానికి అర్ధమే లేదు’ అని జమ్‌ఖేద్కర్ అన్నారు. ‘ప్రొ. ఆర్‌ఎస్ శర్మ, ఇర్ఫాన్ హబీబ్ మొదలైన వారు పురాతన చరిత్రను తిరిగి రాసిన తర్వాత దీనిపై పూర్తిగా కొత్త సిద్ధాంతం రూపుదిద్దుకుంది’ అన్నారు. చరిత్రను ఎప్పటికప్పుడు ‘తిరగరాయడం’ ఆరోగ్యకరమైన పద్ధతి అంటూ ఆయన తనను తాను సమర్థించుకున్నారు. ‘కాలం గడిచేకొద్దీ కొత్త చైతన్యం రావడంతో, గత సిద్ధాంతాలు వదిలేసిన లేదా పట్టించుకోని అంశాలను వెలికితీసే అవకాశముంటుంది’ అన్నారు.