జాతీయ వార్తలు

సమస్యకు పరిష్కారం రక్తపాతం కాదు: రావత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: జమ్ము-కాశ్మీర్ సమస్యకు ఉగ్రవాదం పరిష్కారం కాదని, రక్తపాతం ఏ సమస్యనూ పరిష్కరించలేదని ఆ దిశగా అడుగులు వేస్తున్న యువత త్వరలోనే తెలుసుకుంటారని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. మిలిటెన్సీతో ఏ సమస్యా పరిష్కారం కాదు.. వారి ఆశలు నెరవేరాలంటే కేవలం శాంతియుత సహజీవనమే పరిష్కారమని ఆయన అన్నారు. జమ్ము-కాశ్మీర్‌లోని ఒక రెజిమెంట్ 70వ స్థాపనా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఏదో కొద్దిమంది యువకులు ఉద్రేకంతో అల్లర్లకు దిగినంత మా త్రాన ఏమీ సాధించలేరని, ఇక్కడ శాంతియుత పరిస్థితులు నెలకొల్పడం పెద్ద కష్టమైన పనేం కాదని అన్నారు. అందుకు అందరం కలిపి పనిచేయాలని కాశ్మీర్‌లో ఎక్కువ కాలం పనిచేసిన అనుభవంతో రావత్ చెప్పారు.