జాతీయ వార్తలు

ఎలా అడ్డుకుంటారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: పాకిస్తాన్‌లోని ప్రముఖ గురుద్వారాను సందర్శించడానికి వెళ్లిన సిక్కు యాత్రికులను, భారత హై కమిషనర్ కలుసుకోకుండా, ఆ దేశం అడ్డుకోవడంపై భారత్ తీవ్ర ఆక్షేపణ తెలిపింది. మన విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం, 1800 మంది సిక్కు యాత్రికులు ఏప్రిల్ 12 నుంచి పాకిస్తాన్‌లో మతపరమైన తీర్థయాత్రలు చేస్తున్నారు. బైశాఖి పర్వదినాన్ని పురస్కరించుకొని, వీరికి శుభాకాంక్షలు తెలపడానికి భారత హైకమిషనర్ పంజారా సాహిబ్ గురుద్వారాకు బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో అనుకోని భద్రతా కారణాలను చూపుతూ, తక్షణమే వెనుదిరగాలని పాక్ ప్రభుత్వం కోరింది. దీంతో ఆయన సిక్కు తీర్థయాత్రికులను కలుసుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. రెండు దేశాల్లో ఉన్న పవిత్ర స్థలాలను ఇరుదేశాల పౌరులు సందర్శించేందుకు వీలుగా భారత్-పాక్‌ల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగానే సిక్కు యాత్రికులు పాక్‌లో పర్యటిస్తున్నారు.
ఇదిలావుండగా భారత్-పాక్‌ల మధ్య కొంతకాలంలో దౌత్యవేత్తల విషయంలో వివాదం కొనసాగుతోంది. దీన్ని పరిష్కరించేందుకు రెండు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఈ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా భారత హైకమిషనర్ పట్ల పాక్ ప్రభుత్వం అనైతిక రీతిలో వ్యవహరించడం దారుణమని భారత్ పేర్కొంది. యాత్రికులకు అవసరమైన సహాయ సహకారాలు అందించే బాధ్యతను హైకమిషనర్లకు ప్రభుత్వం అప్పగిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక దౌత్యవేత్తతో ఈ విధంగా వ్యవహరించడం వియన్నా సదస్సుకు పూర్తి విరుద్ధమని కూడా స్పష్టం చేసింది.