జాతీయ వార్తలు

మిశ్రాపై ఐదు అభియోగాలివీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ఏడు ప్రతిపక్ష పార్టీలు ఐదు ఆరోపణలతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసనను ప్రతిపాదించాయి. ఆ ఐదు ఆరోపణలు...
మొదటి ఆరోపణ: ప్రసాద్ విద్యా సంస్థలకు సంబంధించిన కేసులో ముడుపులు పుచ్చుకోవటం. దీపక్ మిశ్రా ఈ కేసును విచారించిన తీరు వివాదాలు రేకెత్తించింది. ఈ కేసులో సిబిఐ చార్జ్‌షీట్ కూడా దాఖలు చేసింది. ఒరిస్సా హైకోర్టు మాజీ న్యాయమూర్తి సహా పలువురు మధ్యవర్తుల మధ్య జరిగిన సంభాషణల రికార్డులు ఇందుకు నిదర్శనమని ఆరోపించారు.
రెండో ఆరోపణ: ప్రసాద్ విద్యా సంస్థలకు సంబంధించిన రిట్ పిటిషన్ వ్యవహారంలో దీపక్ మిశ్రా పరిపాలనా వ్యవహారాలతో పాటు న్యాయపరమైన అంశాల్లో కూడా జోక్యం చేసుకున్నారు. దీపక్ మిశ్రాపై ఆరోపణలకు సంబంధించిన కేసులో ఎలా జోక్యం చేసుకుంటారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి.
మూడో ఆరోపణ: ప్రధాన న్యాయమూర్తి ఒక రాజ్యాంగ బెంచిలో ఉన్నప్పుడు కేసులు కేటాయించవలసి వస్తే ఆందుకు సంబంధించిన విజ్ఞప్తిని మొదటి న్యాయమూర్తి సమక్షంలో చేయవలసి ఉంటుంది. 2017 నవంబర్ తొమ్మిదో తేదీన న్యాయమూర్తి చలమేశ్వర్ ముందు పదిన్నర గంటలకు ఒక రిట్ పిటిషన్ పరిశీలనకు వచ్చింది. అప్పుడు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా రాజ్యాంగ బెంచిలో విచారణ కొనసాగిస్తున్నందున రిట్ పిటిషన్‌ను తరువాత చేపట్టాలని నిర్ణయించారు. ఈ రిట్ పిటిషన్‌ను తరువాత చేపట్టినప్పుడు 2017 నవంబర్ ఆరోతేదీతో ఉన్న ఒక నోట్‌ను రిజిష్ట్రీ అధికారి ఒకరు కేసును విచారిస్తున్న న్యాయమూర్తి ముందు పెట్టారు. మూడు ఆరోపణలకు ఇది పునాది అని ప్రతిపక్షాలు తమ అభిశంసనలో పేర్కొన్నాయి.
నాలుగో ఆరోపణ: దీపక్ మిశ్రా న్యాయవాదిగా పని చేస్తున్న సమయంలో కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన వ్యవహారం. దీపక్ మిశ్రా ఈ భూమిని కొనుగోలు చేసే సమయంలో తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ఐదో ఆరోపణ: కేసులను ఇతర న్యాయమూర్తులకు కేటాయించటంలో దీపక్ మిశ్రా తన అధికారాలను దుర్వినియోగం చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. తద్వారా ఆయన ఆ కేసుల అంతిమ తీర్పులను ప్రభావితం చేసేందుకు ఇలా వ్యవహరించారని ఏడు ప్రతిపక్షాలు తమ అభిశంసనలో ఆరోపించాయి.