జాతీయ వార్తలు

మోదీ.. దుమ్ము దులిపేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో మాట్లాడేందుకు తనకు 15 నిమిషాల సమయం ఇస్తే ఆయన బండారం బయట పెడతానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సవాల్ చేశారు. సోమవారం ఢిల్లీలోని తాల్కాతోరా స్టేడియంలో జరిగిన రాజ్యాంగాన్ని పరిరక్షిద్దాం కార్యక్రమంలో దళితులను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. పార్లమెంటులో 15 నిమిషాల సమయం కేటాయిస్తే నీరవ్ మోదీ, లలిత్ మోదీ, రాఫెల్ డీల్ తదితర వ్యవహారాలపై దుమ్ము దులిపేస్తానని అన్నారు. మోదీకి దేశం వద్దు.. దళితులు వద్దు.. బడుగు బలహీన వర్గాలు వద్దు.. ఆయనకు కేవలం మోదీలు కావాలి అంటూ వ్యంగ్య బాణాలు వేశారు. తానొక్కడే మాట్లాడాలి.. మిగతా వాళ్లెవ్వరూ మాట్లాడ కూడదనేదే మోదీ ఆలోచనా విధానమని రాహుల్ విమర్శించారు. ‘కుమార్తెను రక్షించండి, కుమార్తెను చదివించండి’ అనేది మోదీ మొదటి నినాదం. అయితే ఇప్పుడది ‘కుమార్తెను రక్షించండి’కి మాత్రమే పరిమితమైంది. బీజేపీ శాసనసభ్యుల చెర నుండి కుమార్తెలను రక్షించు కోవడమే ఇప్పుడు తల్లిదండ్రుల కర్తవ్యమని ఎద్దేవా చేశారు. దళితులపై దాడులు.. మహిళలపై అత్యాచారాలు.. యువకులకు నిరుద్యోగం.. ఇవీ మోదీ మనకిచ్చారని రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పకోడీలు చేయటంలో ఆధ్యాత్మిక చింతన చూడాలంటూనే, నరేంద్ర మోదీ మాత్రం తాను మరోసారి ప్రధాన మంత్రి కావాలంటే
ఏం చేయాలా? అనే ఆలోచిస్తుంటారని రాహుల్ విమర్శించారు. ఆరెస్సెస్ భారత రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తోందని దుయ్యబట్టారు. దేశ ప్రజలు 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమ మనసులోని
మాటను నరేంద్ర మోదీకి వినిపిస్తారని రాహుల్ చెప్పారు. నరేంద్ర మోదీ దళిత, వెనుకబడిన కులాల వ్యతిరేకి అని ఆరోపించారు. వాల్మీకులు తమ పొట్ట నింపుకునేందుకు కాకుండా ఆధ్యాత్మిక చింతన కోసం మరుగుదొడ్లు పరిశుభ్రం చేస్తారని తన పుస్తకం ‘కర్మయోగి నరేంద్ర మోదీ’లో రాసుకున్నారని, ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి దళితుల అభివృద్ధికి కృషి చేస్తాడా? అని రాహుల్ ప్రశ్నించారు. మురుగు తీసేటప్పుడు ఆధ్యాత్మిక చింతనతో పనిచేస్తారా? అని రాహుల్ నిలదీశారు. పరిసరాల పరిశ్రుభత కోసం వాల్మీకులు ఈ పని చేస్తున్నారని నరేంద్ర మోదీ రాసుకున్నారు. ఆధ్యాత్మిక చింతన, పరిసరాల పరిశుభ్రతకు కట్టుబడి ఉన్నారు కాబట్టే వాల్మీకులు తరతరాల నుండి మురుగు తొలగించే పని చేస్తున్నారు. వేరేపని చేసే అవకాశం ఉన్నా వారు ఇదే పనికి పరిమితమై పోయారని నరేంద్ర మోదీ రాయటం ఆయన ఆలోచనా విధానానికి అద్దం పడుతోందని రాహుల్ దుయ్యబట్టారు. నరేంద్ర మోదీ ఆలోచనా విధానాన్ని దళిత, బడుగు వర్గాల ప్రజలు బాగా అర్థం చేసుకోవాలన్నారు. దళితులు తనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? తనపట్ల ఎందుకు ఆగ్రహంతో ఉన్నారని నరేంద్ర మోదీ ఇటీవల ఆయనను కలిసినవారిని అడుగుతున్నారు. వాల్మీకులు ఆధ్యాత్మిక చింతనకోసం మురుగు ఎత్తివేసే పని చేస్తారని మీరు ఆలోచిస్తారు కాబట్టే దళితులు ఆగ్రహంతో ఉన్నారని రాహుల్ చెప్పారు. నరేంద్ర మోదీ హృదయంలో దళితులు, మహిళలు, వెనుకబడిన కులాల వారికి ఎలాంటి స్థానం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు ఆరోపించారు. దళితులపై ఇన్ని దాడులు జరుగుతున్నా మోదీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాజ్యాంగం మాత్రమే దళితులు, మహిళలు, బడుగులను రక్షిస్తుందన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, సంస్థలను భ్రష్టు పట్టిస్తోంది, విధ్వంసానికి గురిచేస్తోందని రాహుల్ ఆరోపించారు. అన్ని సంస్థల్లో ఆరెస్సెస్ వారిని నియమిస్తున్నారని ఆయన చెప్పారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కూడా ప్రజల వద్దకు వెళ్లి న్యాయం అడుగవలసిన దుస్థితి దేశంలో నెలకొన్నదని అన్నారు. పార్లమెంటు నోరుకూడా నొక్కివేస్తున్నారని, దేశ ప్రతిష్టను భ్రష్టు పట్టిస్తున్నారని రాహుల్ తీవ్రస్థాయలో ధ్వజమెత్తారు.

చిత్రం..ఢిల్లీలోని తాల్కాతోరా స్టేడియంలో సోమవారం నిర్వహించిన రాజ్యాంగాన్ని రక్షిద్దాం దేశవ్యాప్త ఉద్యమ కార్యక్రమంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ