జాతీయ వార్తలు

అఫ్‌స్పా ఉపసంహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: సాయుధ దళాలకు ప్రత్యేకాధికారాలు కల్పిస్తోన్న అఫ్‌స్పా చట్టాన్ని మేఘాలయ నుంచి పూర్తిగా ఉపసంహరించినట్టు హోంశాఖ అధికారులు వెల్లడించారు. అలాగే, అరుణాచల్, అసోంలో ఈ చట్టం అమల్లోవున్న ప్రాంతాలను కుదించామని వెల్లడించారు. ఆపరేషన్స్ నిర్వహణ, ఎలాంటి నోటీసులు లేకుండా ఎవరినైనా ఎక్కడైనా అరెస్ట్ చేసే ప్రత్యేకాధికారాలు సాయుధ బలగాలకు కల్పిస్తున్న అఫ్‌స్పా చట్టాన్ని గత మార్చి 31నే మేఘాలయ నుంచి ఉపసంహరించారు. సరిహద్దుల్లో భద్రత విషయంలో చెప్పుకోదగ్గ ప్రగతి కనిపిస్తోన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు హోంశాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. అసోం సరిహద్దులోని అరుణాచల్ ప్రదేశ్‌లో ఈ చట్టం పరిధికిందవున్న 16 పోలీస్ స్టేషన్లను 8 స్టేషన్లకు కుదించారు.
సాయుధ బలగాలకు ‘నిద్రాణ అధికారాలు’ కల్పిస్తోన్న వివాదాస్పద చట్టంపట్ల ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకాశ్మీర్‌లోని ప్రజా సంఘాల నుంచి చాలాకాలంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. అఫ్‌స్పా చట్టం దశాబ్దాలుగా నాగాలాండ్‌లోను, 1990నుంచీ అసోంలోను అమల్లో ఉంది. నాగాలాండ్‌లో చట్టం అమలు తీవ్రతను తగ్గించేందుకు 2015 ఆగస్టు 3న ప్రధాని సమక్షంలో నాగా తిరుగుబాటు దళం ఎన్‌ఎస్‌సీఎన్-ఐఎం ప్రధాన కార్యదర్శి తుయింగెలాంగ్ ముయివా, ప్రభుత్వ ప్రతినిధి ఆర్‌ఎన్ రవిల మధ్య ఒప్పందం జరిగినా, చట్టం మాత్రం అమలవుతూనే ఉంది. అయితే, గత నాలుగేళ్లలో ఈశాన్య రాష్ట్రాల శాంతి భద్రతల్లో అసాధారణ మెరుగు కనిపిస్తోందని, గత రెండు దశాబ్దాల కాలంలో 2017లోనే అత్యంత శాంతి వాతావరణం కనిపించిందని హోంశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. త్రిపుర, మిజోరం రాష్ట్రాల్లో తిరుగుబాటు ఘటనలు మాయమయ్యాయని, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో తిరుగుబాటు ఘటనలు శాంతించాయని హోంశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ పరిస్థితుల్లోనే అఫ్‌స్పా చట్టాన్ని ఉపసంహరించినట్టు ఆ అధికారి స్పష్టం చేశారు.