జాతీయ వార్తలు

హింసతో గెలిచే పన్నాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉడిపి/కర్కల/బెల్తాండే, ఏప్రిల్ 23: కర్నాటక ఎన్నికల్లో గెలవడం కోసం ‘కేరళ తరహా రాజకీయ హింస’తో అధికార కాంగ్రెస్ ముందుకెళ్తోందని కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘బీజేపీ అధికారంలోకి వస్తే ఇలాంటి హింసాత్మక రాజకీయాలను స్వస్తి చెబుతుంది’ అని ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు. ఏదో విధంగా అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ ఎన్నికల ప్రచార సభల్లో సోమవారం రాజ్‌నాథ్ మాట్లాడుతూ ‘సిద్దరామయ్య హయాంలో 3,781 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు’ అని విమర్శించారు. ఇది సరిపోదన్నట్టు పొరుగు రాష్ట్రం కేరళ నుంచి హింసావిధానాన్ని దత్తత తెచ్చుకుని రాజకీయ హింసకు పాల్పడుతోందని హోమ్‌మంత్రి అన్నారు. సిద్దరామయ్య ప్రభుత్వంలో అనేక రాజకీయ హత్యలు జరిగాయని ఆయన ఆరోపించారు. ‘బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రాజకీయ హత్యలకు చరమగీతం పాడుతుంది’ అని ఆయన హామీ ఇచ్చారు. 224 స్థానాలున్న కర్నాటక అసెంబ్లీకి వచ్చేనెలలో ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి రాజకీయ పార్టీల ప్రముఖు తాకిడి పెరగడంతోపాటు అభ్యర్థులు జాబితాలను ప్రకటించారు. బీజేపీ నాలుగోవిడత జాబితాను సోమవారం విడుదల చేసింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రంలో పర్యటించి అధికార కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతోందని షా ఆరోపించారు. అలాగే ఎన్నికల సభల్లో మాట్లాడిన హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ కూడా కర్నాటకలో శాంతి భద్రతలు క్షీణించాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఉన్నతాధికారులకూ రక్షణ లేకుండాపోయిందని ఆయన చెప్పారు. ‘మంగళూరు డిప్యూటీ ఎస్పీ ఎంకే గణపతి మరణానికి కారకులెవరు? మైసూర్ కలెక్టర్ శిఖారాయ్ మృతి వెనక ఎవరున్నారు? లోకాయుక్త ఆఫీసులోనే దాడి ఘటన దేనికి సంకేతం?’ అంటూ రాజ్‌నాథ్ ప్రశ్నల వర్షం కురిపించారు. జూలై 7న గణపతి (51) మెడికెరీలోని లాడ్జిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతిచెందారు. తనకు ఏదైనా అయితే రాష్టప్రతి, సీనియర్ అధికారిదే బాధ్యత అంటూ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆరోపించారు. రాజధాని బెంగళూరులోని లోకాయుక్త ఆఫీసులో ఏకంగా జడ్జి విశ్వనాథ్ శెట్టిపైనే దాడి జరిగింది. తన ఫిర్యాదును తిరస్కరించారన్న ఆగ్రహంతో శెట్టిపై ఓ వ్యక్తి దాడి చేశాడు.
ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబానికి లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇస్తామన్న సిద్దరామయ్య హామీ ఏమైందని హోమ్‌మంత్రి నిలదీశారు. సిద్ద రామయ్య ‘సిద్దే సర్కార్.. నిత్యం నిద్రావస్థలోనే ఉంటుంది’ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందే మైనారిటీ-మెజారిటీలు కాంగ్రెస్‌కు గుర్తుకొచ్చాయా? అంటూ ఆయన ప్రశ్నించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సిద్దరామయ్య ప్రభుత్వం కొత్త దారులు వెదుకుతోందని సింగ్ విమర్శించారు. టిప్పూ జయంతిని నిర్వహించే ప్రభుత్వం హనుమాన్ జయంతికి అనుమతి నిరాకరించిందని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. 14వ ఫైనాన్స్ కమిషన్ కింద కర్నాటకు కేంద్ర ప్రభుత్వం 2 లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్న రాజ్‌నాథ్ ‘యుపీఏలో కేవలం 88 వేల కోట్ల రూపాయలే వచ్చాయి’ అని పేర్కొన్నారు. యెడ్యూరప్ప ముఖ్యమంత్రి అయితే రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తారని హోమ్‌మంత్రి హామీ ఇచ్చారు.