జాతీయ వార్తలు

రేపు కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఈ నెల 27న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళూరులో పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు. కర్నాటక అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో రాహుల్ ఏడవసారి రాష్ట్రంలోకి ఎన్నికల ప్రచార నిమిత్తం వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తర కర్ణాటకలోని అంకోలా సిటీ, మస్తికట్టె సర్కిల్ (కుంట), సరస్వతీ సర్కిల్ (హొన్నావర్)లను సందర్శించి, భక్తల్‌లో ఏర్పాటు చేసే సమావేశంలో ప్రసంగిస్తారని పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సందర్భంగా రాహుల్ పార్టీ మ్యానిఫెస్టోను మంగళూరులో విడుదల చేస్తారని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు.