జాతీయ వార్తలు

ఎవరి వ్యూహం వారిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: కర్నాటకలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. రాష్ట్ర శాసనసభలోని 222 సీట్లకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం జరుగుతుంది. పూర్తి మెజారిటీ తమకే లభిస్తుందని బీజేపీ, కాంగ్రెస్ చెప్పుకుంటుంటే జేడీ(ఎస్) అధినాయకుడు దేవెగౌడ మాత్రం కింగ్ మేకర్ పాత్ర నిర్వహిస్తామనే ధీమాతో ఉన్నారు. శాసనసభ ఎన్నికల ఫలితాల ఆధారంగా తమ వ్యూహాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ, జేడీ(ఎస్) సిద్ధమవుతున్నాయి. శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నానికి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ కూటమి లేదా గ్రూపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుందనేది స్పష్టమవుతుంది. వివిధ టీవీలు, సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో హంగ్ అసెంబ్లీ వస్తుందని అంచనా వేసినందున ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీజేపీ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మేఘాలయ, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పు కర్నాటకలో దొర్లకుంటా చూసుకునేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు
గులాం నబీ ఆజాద్, సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్‌ను బెంగళూరుకు పంపించింది. కర్నాటక ఇంచార్జ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న గులాం నబీ ఆజాద్‌కు జేడీ(ఎస్) అధినాయకుడు, మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడతో మంచి సంబంధాలున్నాయి. కాంగ్రెస్ ఏకైక పెద్ద పార్టీగా అవతరించి జేడీ(ఎస్) మద్దతు తీసుకోవలసి వచ్చే పక్షంలో గులాం నబీ ఆజాద్ ఎంతో ఉపయోగపడతారనేది అందరికీ తెలిసిందే. అశోక్ గెహ్లాట్ కూడా జేడీ(ఎస్)తో చర్చలు జరిపే ప్రక్రియకు ఎంతో ఉపయోగపడతారని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. ఆ పరిస్థితి ఎదురైతే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్థానంలో మరో నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమించవలసి ఉంటుంది. సిద్ధరామయ్యను మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు దేవెగౌడ ఎటువంటి పరిస్థితిల్లోనూ ఒప్పుకోరనేది అందరికీ తెలిసిందే. ఈ కారణం చేతనే సిద్ధరామయ్య రెండురోజుల క్రితం బెంగళూరులో విలేఖరులతో మాట్లాడుతూ దళితుడిని ముఖ్యమంత్రిగా నియమించాలని పార్టీ అధినాయకత్వం భావించే పక్షంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. దళిత నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారనేది అందరికీ తెలిసిందే.
ఇదిలా ఉంటే బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి అనంత కుమార్ తదితరులు బెంగళూరులోనే ఉన్నారు. కర్నాటక పరిస్థితిపై ఒక కనే్నసి పెట్టిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కొందరు సీనియర్ నాయకులను బెంగళూరుకు పంపించారనే మాట వినిపిస్తోంది. అయితే వారు ఎవరేది వెళ్లడి కావటం లేదు. బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా అవతరించి జేడీ(ఎస్) మద్దతు తీసుకోవలసిన అవసరం వస్తే ఏం చేయాలనేది అమిత్ షా ఇప్పటికే నిర్ణయించారనే మాట వినిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రాకుండా చూసేందుకు దేవెగౌడ కుమారుడు కుమారస్వామిని ముఖ్యమంత్రిగా నియమించేందుకు కూడా బీజేపీ అధినాయకత్వం వెనకాడదని అంటున్నారు. కుమారస్వామిని ముఖ్యమంత్రిగా అంగీకరించే అంశాన్ని అమిత్ షా ఇప్పటికే దేవెగౌడకు దూతల ద్వారా తెలియజేశారని అంటున్నారు. కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అది దక్షిణాదిలో బీజేపీ బలపడేందుకు తోడ్పడటంతోపాటు 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని అధినాయకత్వం భావిస్తోంది.
రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే పక్షంలో దేవెగౌడ ఎవరికి చేయూత నిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. దేవెగౌడ తన కుమారుడు కుమారస్వామిని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారనేది అందరికీ తెలిసిందే. కింగ్ మేకర్ పాత్ర నిర్వహించనున్న దేవెగౌడ తన కుమారుడు కుమారస్వామిని ముఖ్యమంత్రిగా నియమించాలనే లక్ష్యంతోనే రెండు జాతీయ పార్టీల నాయకులతో చర్చలు జరుపుతారని అంటున్నారు.