జాతీయ వార్తలు

నిందితుడు శశిథరూరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఆమె భర్త శశిథరూర్‌పై ఢిల్లీ పోలీసులు చార్జి షీటు దాఖలు చేశారు. సునంద ఆత్మహత్యకు ప్రేరేపించింది కాంగ్రెస్ నాయకుడైన శశిథరూరేనని, ఇందుకు సంబంధించిన వివరాలు వెలికితీయాలంటే ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని ఢిల్లీ కోర్టుకు స్పష్టం చేశారు. ఈ కేసులో శశిథరూర్‌నే ఏకైక నిందితుడిగా పేర్కొంటూ మొత్తం 3వేల పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేసిన పోలీసులు, ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి బలమైన, నిర్థిష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు. శశిథరూర్ తన భార్యపై క్రూరంగా ప్రవర్తించారని కూడా పేర్కొన్నారు. ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ధర్మేంద్ర సింగ్ కోర్టులో ఈ చార్జిషీట్ దాఖలైంది. ఈనెల 24న దీనిపై ఆయన విచారణను చేపడతారు. లోక్‌సభలో తిరువనంతపురానికి ప్రాతినిథ్యం వహిస్తున్న శశిథరూర్‌ను నిందితుడిగా పిలవాలని దర్యాప్తు ఏజెన్సీ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ కేసులో శశిథరూర్, సునందల పనివాడు నారాయణ సింగ్‌ను కీలక సాక్షిగా పేర్కొంది. 2014 జనవరి 17న ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్ రూంలో అనుమానాస్పద స్థితిలో
సునంత పుష్కర్ మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఏళ్ల తరబడి విచారణ జరిపిన పోలీసులు, శశిథరూర్‌పై భారత శిక్షాస్మృతిలోని 498ఏ (ఓ మహిళ పట్ల భర్త లేదా ఆమె బంధువులు క్రూరంగా ప్రవర్తించడం), అలాగే సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించటం)ల కింద శశిథరూర్‌పై కేసులు పెట్టారు. శశిథరూర్‌తో పెళ్లయిన 3ఏళ్ల మూడు నెలల 15రోజుల వ్యవధిలోనే సునందా పుష్కర్ మరణించిందని పోలీసులు తెలిపారు.
చార్జిషీట్ రబ్బిష్: శశి
తన భార్య సునంత హత్య కేసులో తనను నిందితుడిగా పేర్కొంటూ ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ పసలేనిదిగా కొట్టిపారేశారు. దీన్ని తాను గట్టిగా సవాల్ చేస్తానని స్పష్టం చేశారు. తనపై దాఖలైన చార్జిషీట్ గురించి తెలుసుకున్నానని, ఇది హాస్యాస్పదంగా ఉందన్నారు. తనపై దాఖలైన ఆరోపణలను గట్టిగా ఎదుర్కొంటానని థరూర్ తెలిపారు. సునందను ఆత్మహత్యకు తాను ప్రేరేపించినట్టుగా చార్జిషీట్‌లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించిన థరూర్ ‘సునంద అంత తేలికగా ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదు. అలాంటిది మరొకరి ప్రేరణతో ఆమె ఆత్మహత్యకు పాల్పడటం ఏమిటి?’ అని థరూర్ ట్వీట్ చేశారు. అసలు దర్యాప్తు జరిగిన తీరే సరైన రీతిలో, సక్రమంగా సాగలేదని చెప్పడానికి ఈ ఆరోపణే నిదర్శనమన్నారు.