జాతీయ వార్తలు

కావేరీ స్కీమ్ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: కావేరీ జలాల నిర్వహణ బోర్డు ఏర్పాటు విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొన్న కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఇందుకు సంబంధించిన స్కీమ్‌ను ఆమోదంకోసం సుప్రీం కోర్టుకు నివేదించింది. దక్షిణాదిన ఉన్న నాలుగు కావేరీ పరీవాహక రాష్ట్రాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ పంపిణీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ ముసాయిదా పథకాన్ని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సారథ్యంలోని సుప్రీం ధర్మాసనం స్వీకరించింది. ఈ నెల 16న దీన్ని పరిశీలించి ఆయా రాష్ట్రాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
అయితే కేంద్రం సమర్పించిన కావేరీ జలాల నిర్వహణ పథకం తాము గతంలో ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఉందా లేదా అనే విషయాన్ని తాము నిర్ధారించుకోవలసి ఉందని ఈ బెంచ్ స్పష్టం చేసింది. అయితే ఈ పథకం ఎంతమేరకు సహేతుకం అనే విషయంలో తాము లోతుగా పరిశీలించబోమని కేవలం తమ తీర్పునకు అద్దం పట్టేదిగా ఉందా లేదా అన్న అంశాన్ని మాత్రమే తాము పరిశీలిస్తామని తెలిపింది. ఈ పథకానికి ఏ రకమైన పేరు పెట్టాలన్న విషయంలో కేంద్ర ప్రభుత్వం డైలమాలో పడిందని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ కోర్టుకు స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా కావేరీ జలాల పంపిణీని పర్యవేక్షించేందుకు వీలుగా ఈ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు.