జాతీయ వార్తలు

మీది కీలక బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: భవిష్యత్తులో దౌత్యవేత్తలుగా గురుతర బాధ్యతను నిర్వహించాల్సిన అధికారులు వాటికి అనుగుణంగా తమ వ్యవహార శైలిని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఐఎఫ్‌ఎస్ శిక్షణను పూర్తి చేసుకున్న వారిని ఉద్దేశించి మాట్లాడిన మోదీ కాబోయే దౌత్యవేత్తలందరూ ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని, దానివల్ల కలిగే ప్రయోజనాలను ఔపోసన పట్టాలన్నారు. ఆయా ప్రభుత్వాలతో సామరస్య పూర్వకంగా పనిచేయడంతోపాటు ఆయా దేశాల్లో నివసించే భారతీయ సంతతితో కూడా కలసి మెలసి మెలగాలని, వారి అవసరాల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని మోదీ పిలుపునిచ్చారు. ఇతర దేశాలతో దౌత్య, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాల నిర్వహణలో కీలకపాత్ర పోషించే ఐఎఫ్‌ఎస్ అధికారులు తమ బాధ్యతను, హోదాను, తమ విధుల ప్రాధాన్యతను అనునిత్యం పరిగణనలోకి తీసుకుని వ్యవహరించాలన్నారు. మొత్తం 39 మంది ఆఫీసర్ ట్రైనీలతో మాట్లాడిన మోదీ వారి బాధ్యతల గురించి, భారత్‌తో ఇతర దేశాల సంబంధాల గురించి వాటిని గుణాత్మకంగా పెంపొందించాల్సిన అవసరం గురించి మాట్లాడారు. భారతదేశ ఘనచరిత్రను నిరుపమాన సాంస్కృతిక వారసత్వాన్ని శ్లాఘనీయ సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అధికారులు వ్యవహరించాలని మోదీ అన్నారు. ప్రభుత్వాలతోపాటు భారతీయ సంతతితోకూడా అధికారులు ఎప్పటికప్పుడు మమేకం కావాలని తెలిపారు. ఇతర దేశాలతో భారత్ సంబంధాల్లో అక్కడ నివసిస్తున్న భారతీయుల ప్రాధాన్యత కూడా ఎంతో ఉంటుందన్నదని వాస్తవమని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించడానికి వీలు లేదని ఈ ఐఎఫ్‌ఎస్ ట్రైనీలకు మోదీ స్పష్టం చేసినట్లు ఓ అధికారిక ప్రకటన వెలువడింది.

చిత్రం..ఢిల్లీలో సోమవారం ఐఎఫ్‌ఎస్ శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ