జాతీయ వార్తలు

‘రాజ్యాంగ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: దేశంలోని ఓబీసీలకు రాజ్యాంగ పదవుల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ జాతీయ సంయుక్త కార్యచరణ కమిటీ స్పష్టం చేసింది. మంగళవారం జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, జస్టిస్ ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన సదస్సులో 12 రాష్ట్రాలకు చెందిన బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ సుప్రీం కోర్టు, హైకోర్టు, చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ప్రైవేటు రంగాల్లో రాజ్యాం గ పరంగా ఓబీసీలకు దక్కాల్సిన 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.