జాతీయ వార్తలు

బీజేపీపై ఏపీలో దుష్ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే అధికార, ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై దుష్ప్రచారం సాగిస్తున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రాల అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ సభ్యులతో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా విలేఖరులతో మాట్లాడుతూ విభజిత ఏపీ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, విభజన చట్టంలోని హామీల్లో 85శాతం పూర్తి చేసిందని, నూటికి నూరు శాతం విభజన చట్టంలోని హామీలను కేంద్రం పూర్తి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీపైన, నరేంద్ర మోదీపై దుష్ప్రచారం జరుగుతోందని, దీనికి టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలే కారణమని, బీజేపీపై దుష్ప్రచారం చేయడం ద్వారా 2019 ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలని ఆ పార్టీలు చూస్తున్నాయని అన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తామని, వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తామని ఆయన స్పష్టం చేశారు. విభజన చట్టంలో 10 సంవత్సరాల సమయం ఉంటే, ఇప్పటికే నాలుగు సంవత్సరాల కాలంలో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చిందని కన్నా స్పష్టం చేశారు. తనను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ధన్యవాదాలు తెలిపారు.

చిత్రం..ఢిల్లీలో సోమవారం జరిగిన బీజేపీ విస్తృత స్థాయ సమావేశానికి హాజరైన
ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ