జాతీయ వార్తలు

ఉత్తరాదిపై పగబట్టిన ప్రకృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: ఉత్తర భారతంపై ప్రకృతి పగబట్టింది. ఐదు రాష్ట్రాల్లో ఇసుక తుపాను కల్లోలం రేపింది. ఆదివారం పిడుగుపాటుకు 71 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లో 42 మంది చనిపోయినట్టు కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో ప్రచండ గాలులు బీభత్సం సృష్టించినట్టు ఓ అధికార ప్రకటనలో తెలిపారు. యూపీలో 42 మంది, పశ్చిమ బెంగాల్‌లో 14 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 12 మంది ఢిల్లీలో ఇద్దరు, ఉత్తరాఖండ్‌లో ఒకరు మరణించారు. అనేక మంది గాయపడ్డారని హోమ్‌శాఖ అధికార ప్రతినిధి సోమవారం వెల్లడించారు. యూపీలో 83 మంది, ఢిల్లీలో 11 మంది, ఢీల్లీ, ఉత్తరాఖండ్‌లో ఇద్దరేసి చొప్పున గాయపడ్డారన్నారు. జిల్లాల వారీగా ప్రకృతి విలయం వివరాలు తెలిపారు. యూపీలో 24, పశ్చిమ బెంగాల్‌లో ఆరు, ఆంధ్రప్రదేశ్‌లో మూడు, ఢిల్లీలో రెండు, ఉత్తరాఖండ్‌లో ఒక జిల్లాలో తీవ్ర ప్రభావం చూపింది. ఉరుములు, మెరుపులకుతోడు పిడుగులతో అస్తవ్యస్తమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆ ప్రతినిధి చెప్పారు. తీవ్రమైన గాలులకు చెట్లు, విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. విమాన, రైల్వే, రోడ్డు రవాణ సర్వీసులకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. అలాగే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, అస్సాం, మేఘాలయా, కర్ణాటక, కేరళ, తమిళనాడులోనూ గాలులు, ఉరుములతో కూడిన వర్గాలు పడ్డాయి. ఈవారం పదిరోజుల్లో భారీ వర్షాలకు యూపీ, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో 134 మంది మృత్యువాత పడ్డారు. కనీసం 400 మంది గాయపడ్డారని హోమ్‌శాఖ పేర్కొంది. యూపీలోనే దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. 84మంది చనిపోగా అందులో ఆగ్రాలోనే ప్రాణనష్టం ఎక్కువన్నారు.

చిత్రం..ఆదివారం రాత్రి ఢిల్లీని కుదిపేసిన పెనుగాలులకు బవానా ప్రాంతంలో కుప్పకూలిన చెట్టు